బెల్లకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ‘రాక్షసుడు’ రిలీజ్ వాయిదా?
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం రాక్షసుడు. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హవీశ్ ప్రొడక్షన్‌లో రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది.
'రాక్షసుడు' జూలై 18న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ఆగస్టు 2న రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం అందాల్సి ఉంది.

సినిమా వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటో తెలియ రాలేదు. ఈ సినిమాతో పాటు 'ఇస్మార్ట్ శంకర్', 'ఆమె', 'కొబ్బరి మట్ట' చిత్రాల రిలీజ్ ఉండటం, ఆ నెక్ట్స్ వీక్ విజయ్ దేవరకొండ మూవీ 'డియర్ కామ్రేడ్' బరిలోకి వస్తుండటంతో థియేటర్ల సమస్యే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'రాక్షసుడు చిత్రాన్ని గ్యాప్ లేకుండా 85రోజులు, 110 కాల్ షీట్లతో పూర్తి చేసినా విడుదల కష్టాలు తప్పడం లేదు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.


Click it and Unblock the Notifications











