అల్లుడు అదుర్స్ ట్రెండింగ్.. ట్రైలర్ చూస్తే మాత్రం!!
అల్లుడు అదుర్స్ అని సినిమా టైటిల్ చూసినప్పుడే కొందరికి తేడా కొట్టినట్టుంది. ఇక ట్రైలర్‌లో అందరికీ ఓ అంచనా వచ్చేసింది. అల్లుడు శీను నుంచి అల్లుడు.. అదుర్స్ సినిమా టైటిల్‌ను తీసుకుని రెండూ కలిపేసి అల్లుడు అదుర్స్ అని మాత్రమే చేశారని అనుకుంటారు. కానీ సినిమా ట్రైలర్ చూస్తుంటే కథలు కూడా అలానే ఉండేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్‌లో ఒక్కటంటే ఒక్క పాయింట్, సీన్ కూడా కొత్తది లేదు.
కందిరీగ, అల్లుడు శీను ఇలా ఎన్నో సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా ట్రైలర్ అని చెప్పి.. అందులో పాటలు నింపేశారు.. మళ్లీ భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో అందరినీ భయపెట్టేశారు. ఇక సంతోష్ శ్రీనివాస్ కామెడీ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అతను విలనా? కమెడియనా? అని కూడా తెలియనంతగా మ్యానేజ్ చేస్తాడు. ఇక్కడ కూడా ప్రకాశ్ రాజ్‌ను విలన్ చేశారా? కమెడియన్‌ను చేశాడో తెలియడం లేదు.

ఇక సోనూ సూద్‌కు అయితే సరిగ్గా ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు. మొత్తం ట్రైలర్‌లో సోనూ సూద్ ఓ రెండు చోట్ల కనిపిస్తాడేమో. కానీ ఈ ట్రైలర్ ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. మరి ఈ సంక్రాంతి బరిలో దిగే అల్లుడు ఏ మేరకు విజయం సాధిస్తాడో చూడాలి. అసలే ఈ సంక్రాంతికి మంచి రసవత్తరమైన పోటీ ఉండేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











