నా కొడుకుని స్క్రీన్‌పై చూస్తే.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు: బెల్లంకొండ సురేష్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసి తొలి మూవీతోనే మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత వంటి సినిమాలతో ప్లాప్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ హిట్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడు. తాజాగా తన కొడుకు గురించి బెల్లంకొండ సురేష్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
రీమేక్ గా ఛత్రపతి:తెలుగులో అనేక ప్లాపుల తర్వాత రాట్ససన్ తమిళ రీమేక్ మూవీ రాక్షసుడుతో మంచి హిట్టు కొట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తర్వాత వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. కెరీర్ లో రెండు హిట్లు తప్పా ప్లాప్స్ ఎదుర్కోన్న సాయి శ్రీనివాస్ మంచి హిట్ కొట్టేందుకు ఛత్రపతి రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచా హీరోయిన్ గా చేసింది.
ఫస్ట్ హీరోగా రికార్డ్:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి మూవీ మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ పలు కామెంట్స్ చేశారు. "మా అబ్బాయిని అల్లుడు శీను తొలి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇప్పించారు. ఆరోజుల్లో ఫస్ట్ హీరోగా ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఫస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన టాప్ 1లో ఉన్న సినిమా అల్లుడు శీను. అలాంటి సినిమాతో ఇక్కడ ఇంట్రడ్యూస్ అయి హిందీలో ఒక్కొక్కటి డబ్ అవుతూ వస్తున్నాయి" అని సురేష్ తెలిపారు.

వరల్డ్ రికార్డ్ క్రియేట్:"అల్లుడు శీను నుంచి మొన్నటి అల్లుడు అదుర్స్ వరకు హిందీలో డబ్ అవుతూ వస్తున్నాయి. అందులో జయ జానకి నాయక సినిమా యూట్యూబ్ లో 720 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలా జరగడం నిజంగా వండర్. మన తెలుగు కుర్రాడు వరల్డ్ వైడ్ రికార్డ్ సృష్టించడం నాకు గర్వకారణంగా ఉంది" అని నిర్మాత సురేష్ పేర్కొన్నారు.

చాలా సందేహాలు:"చిరంజీవి గారు అంకుశం మూవీని హిందీలో ప్రతిబంధ్ గా రీమేక్ చేశారు. గ్యాంగ్ లీడర్ ను ఆజ్ కా గూండా రాజ్ గా అక్కడ ఇక్కడ రీమేక్ చేశారు. ఆ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు రాజమౌళి గారు తెరకెక్కించిన ఛత్రపతిని హిందీలో రీమేక్ చేశాం. దీనిపై చాలామందికి సందేహాలు ఉండొచ్చు, అందరూ మాట్లాడతారు. ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా వివి వినాయక్ అద్భుతంగా తీర్చి దిద్దాడు" అని బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చారు.

సక్సెస్ ఈవెంట్:"నా కొడుకు అయన సాయి శ్రీనివాస్ ను స్క్రీన్ పైన చూస్తుంటే.. వివి వినాయక్ ఇంత బాగా చేయించాడు అనిపించింది. ఈరోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే కేవలం డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. నార్త్ లో హీరోహీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తున్నారు. టైమ్ సరిపోవడం లేదు. ఇక్కడ కూడా పెద్ద ఈవెంట్ చేద్దామనుకున్నాం. 13వ తేదిన సాయంత్రం సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తాం. మాకు సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది" అని తెలిపారు నిర్మాత సురేష్.


Click it and Unblock the Notifications











