హీరోయిన్ శ్రీయను చీటింగ్ చేసిన బెల్లంకొండ.. ఎలా చీట్ చేశారంటే?

తెలుగు సినిమా రంగంలో కింది స్థాయి నుంచి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవల నిర్మాణ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ తన అనుభవాలు, సాధించిన మైలురాళ్లను పంచుకొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శ్రీయ ఓ సినిమా కోసం డేట్స్ అడిగితే ఇవ్వనని చెప్పారు. అయితే ఆమెను ఓ చిన్న అబద్దం ఆడి ఆమె డేట్స్ సంపాదించానని చెప్పారు. ఆయన చెప్పిన అబద్దం ఏమిటి? శ్రీయను ఎలా ఒప్పించారనే విషయంలోకి వెళితే..

నిర్మాతగా నా 25 ఏళ్ల కెరీర్‌ చాలా అద్బుతంగా సాగింది. సుమారుగా 38 సినిమాలను నిర్మించాను. ఈ రంగంలో నిలదొక్కుకొని ఎవరికి దక్కని ఓ గౌరవాన్ని నేను సొంతం చేసుకోవడం గర్వంగా ఉంది. ఇక ముందు కూడా ఇదే విధంగా మంచి సినిమాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాను అని బెల్లంకొండ సురేష్ అన్నారు.

Bellamkonda Suresh Shared Funny Incident with Heroine Shriya Saran

హీరోయిన్ల రెమ్యునరేషన్ల పెంపు విషయంలో తనది వేరే స్టయిల్. వారి పారితోషికాలను గణనీయంగా పెంచిన రికార్డు నాదే. ఓ సమయంలో సమంత 50 లక్షలు తీసుకొంటే.. నేను ఏకంగా నా సినిమా డేట్స్ ఇచ్చినందుకు 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చాను. అలాగే చాలా మంది హీరోయిన్లకు తమకు వచ్చే దాని కంటే ఎక్కువగానే ఇచ్చి సినిమాల్లో నటింప చేశాను అని ఆయన అన్నారు.

ఓ సినిమా కోసం శ్రీయను నేను డేట్స్ అడిగాను. తరుణ్ హీరోగా సినిమా చేస్తన్నామని చెప్పాను. అయితే ఆమె నటించడానికి ఒప్పుకోలేదు. అయితే నేను ఆమెను వదిలిపెట్టలేదు. వెంటపడి డేట్స్ కావాలని అడిగాను. అయితే కథ చెబుతాను. మీకు నచ్చితేనే చేయండని సలహా ఇచ్చాను. దాంతో ఆమె సరేనని చెప్పింది. దాంతో కథ చెప్పడానికి నేను ఢిల్లీకి వెళ్లాను అని తెలిపారు.

Bellamkonda Suresh Shared Funny Incident with Heroine Shriya Saran

ఆ రోజు ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లేట్ కావడంతో అర్ధరాత్రి శ్రీయ ఇంటికి చేరాను. ఆమెకు, వారి తల్లికి కథ చెప్పాను. కథ బాగుంది నేను సినిమా చేస్తానని ఒప్పకొన్నది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి డేట్స్ తీసుకొన్నాను. ఇందులో ట్విస్టు ఏమిటంటే.. నేను తీయబోయేది తరుణ్ సినిమా. కానీ నేను కథ చెప్పింది మాత్రం ఎన్టీఆర్ నటించి అప్పటికే రిలీజైన ఆది సినిమాది. ఆ తర్వాత సినిమా కథ గురించి ఆమె అడగలేదు. నేను గుర్తు చేయలేదు అంటూ బెల్లంకొండ సురేష్ ట్విస్టు ఇచ్చారు.

More from Filmibeat

Read more about: bellamkonda suresh shriya saran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X