పవన్ సినిమా కోసం హాలీవుడ్ స్టార్: తొలిసారి టాలీవుడ్‌లో పని చేయబోతున్న బెన్‌ లాక్

త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అజ్జాతవాసి' తర్వాత రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ చేస్తున్నాడాయన. ఇది పట్టాలపై ఉండగానే మరికొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న సినిమా కూడా ఒకటి. ఏఎమ్ రత్నం నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొగల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ బెన్ లాక్‌ను తీసుకున్నారట. 'ఆక్వామన్', 'వార్‌క్రాఫ్ట్' వంటి చిత్రాలకు పని చేసిన ఆయన.. పవన్ సినిమా కోసం హైదరాబాద్‌లో అడుగు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. గతంలోనే ఈయన గురించి వార్తలు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా అప్పుడు నిరాకరించాడని అన్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో నగరానికి రాడానికి ఒప్పుకున్నాడని సమాచారం. వీఎఫ్ఎక్స్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రూ. 180 కోట్ల బడ్జెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

Ben Lock is on board as the VFX supervisor Pawan Kalyan - Krish Movie

ఇదిలా ఉండగా... ఈ సినిమాలో పవర్ స్టార్.. వజ్రాల దొంగగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కోహినూర్ డైమెండ్‌ను కూడా చూపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాములు కూడా చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, అతనకెంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమా కోసం 'హర హర వీరమల్లు', 'హరహర మహాదేవ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కీలక పాత్ర చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X