Banerjee : మోహన్ బాబు అమ్మనా బూతులు తిట్టారు.. ఎందుకు బతకాలి అనుకున్నా.. భోరుమని ఏడ్చేసిన బెనర్జీ
మా ఎన్నికల్లో ఓటమి పాలయిన ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన చేశారు.. 'సిని'మా' బిడ్డలం' ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఈ క్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా మీడియా సమావేశంలో మాట్లాడిన నటుడు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
మా ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తీరుపై విష్ణు ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు ప్యానెళ్ల మధ్య వాగ్వాదం జరిగిందన్నా సంగతి తెలిసిందే. నమూనా బ్యాలెట్ ఇస్తున్నారంటూ శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్న క్రమంలో ప్రకాష్ రాజ్ వర్గంపై విష్ణు వర్గం దూసుకెళ్లింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. బెనర్జీని చంపేస్తానని కూడా వార్ణింగ్ ఇచ్చారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఆరోజు ఏమి జరిగింది
అయితే ఆరోజు ఏమి జరిగింది అనే విషయం మీద బెనర్జీ స్పందించారు. అందరి ముందు మోహన్ బాబు అన్ని బూతులు తిడుతుంటే బాధ కలిగిందని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి అప్పుడు మా వాళ్లంతా దూరదూరంగా ఉన్నారని, అది చూసి వాళ్లు అలా ప్రవర్తించడంతో చాలా బాధ కలిగిందని అన్నారు. నరేష్ నన్ను ముఠా నాయకుడు అని అన్నారని ఆవేదన వ్యక్తం చేసిన బెనర్జీ అయినా మౌనంగా ఉన్నానని, నేను గెలిచినా సంతోషం లేదని అన్నారు.

అమ్మనా బూతులు తిట్టారు
ఎన్నికల రోజు మోహన్ బాబు తనీష్ ను తిడుతున్నారని నేను వెళ్లి ఆపబోగా నన్ను తిట్టారని అన్నారు. విష్ణు గొడవ వద్దు అన్నారు.. మోహన్ బాబు కొట్టడానికి వచ్చారు అని కన్నీరు పెట్టుకున్నారు అని బెనర్జీ పేర్కొన్నారు. మోహన్‌బాబు అర గంట సేపు పచ్చి బూతులు తిట్టారని, అమ్మనా బూతులు తిట్టారని అన్నారు. డీఆర్సీ పెద్దమనిషి గొడవ జరిగితే ఆపాలి.. కానీ, ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదని పేర్కొన్న ఆయన.. అలాంటి అసోసియేషన్ లో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు..

ఎందుకు బతకాలి అనుకున్నా
అసలు ఇంత అవమానంతో ఎందుకు బతకాలి అనుకున్నాను అని పేర్కొన్న బెనర్జీ మా ఫ్యామిలీ కూడా బాధ పడిందన్నారు.. మూడు రోజులుగా బాధ పడుతూనే ఉన్నానని, మోహన్ బాబు భార్య కూడా ఫోన్ చేసి బాధపడిందని బెనర్జీ పేర్కొన్నారు. వందల మందిలో అమ్మానా బూతులు తిట్టారని నేను వైస్ ప్రెసిడెంట్ అయినా ఎలా పని చేస్తానని అనుకున్నానని కానీ, రాజీనామా చేసిన తర్వాత భారం తగ్గిందని వెల్లడించారు.
Recommended Video

అసోసియేషన్ కు రాజీనామా
విష్ణు బాగా పని చేస్తారన్న నమ్మకం ఉంది. అలా పని చేయాలని కోరుకుంటున్నానని బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇక మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉందని.. మోహన్ బాబు గారి ఇంటికి వెళ్లేంత చనువు ఉందని కూడా బెనర్జీ అన్నారు. లక్ష్మి, విష్ణు పుట్టినప్పటి నుంచి ఎత్తుకుని తిరిగానని అన్నారు. ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయానన్నా ఆయన తాను కూడా అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











