Who is Sivasri Skanda Prasad? బెంగళూర్ ఎంపీ తేజస్వి సూర్యను పెళ్లాడిన వధువు ఎవరో తెలుసా?
బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్ తో ఘనంగా జరిగింది. గురువారం బెంగళూరులో అతి సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకను నిర్వహించారు. పెద్దలు, అతిథుల ఆశీర్వాదంతో ఈ జంట ఒక్కటైంది. వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తో పాటు అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య హాజరయ్యారు. అలాగే కొందరు ప్రముఖ బీజేపీ నాయకులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, శివశ్రీ వివాహ ఫొటోలు ప్రస్తుతం వారి అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో వారికి అభిమానులు, ఫాలోవర్స్ వివాహా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తేజస్వి సూర్య పూర్తి పేరు లక్య సూర్యనారాయణ తేజస్వి సూర్య. ఈయన 1990 నవంబర్ 16న జన్మించారు. ప్రస్తుతం తేజస్వి సూర్యకు 34 ఏళ్లు ఉంటాయి. రిటైర్డ్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రమా, డాక్టర్ ఎల్ ఏ సూర్యనారాయణ దంపతుల కుమారుడే తేజస్వి సూర్య కావడం విశేషం.

అఖిల భారత విద్యా పరిషత్ లో తేజస్వి క్రియాశీలక పాత్ర పోషించాడు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి లోకల్ గా ఎంతో కృషి చేశాడు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరుపున 100కు పైగా బహిరంగ సభలు నిర్వహించి తన గళాన్ని వినిపించారు. అప్పుడు తేజస్వి పేరు కర్ణాటకలో మారుమోగింది. విద్యార్థి నాయకుడి నుంచి ప్రస్తుతం ఎంపీగా ఎన్నికైనంత వరకు ఆయన జర్నీ రాజకీయ ఆశావాహులకు స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను పై మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇదిలా ఉండగా... వధువు శివశ్రీ స్కంద ప్రసాద్ ఎవరనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఈమె చెన్నైకి చెందిన యువతి. కళాకారిణి, కర్ణాటక సంగీతం, భరతనాట్యం, దృశ్య కళలలో ఆమె ప్రసిద్ధి చెందింది. ఆ రంగాల్లో ఆమె ఎంతో కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. మృదంగం మ్యాస్ట్రో సీర్కాజ్హి శ్రీ జే స్కందప్రసాద్ కుమార్తెనే శివశ్రీ. మ్యూజిక్, డ్యాన్స్ లో మంచి గుర్తింపు పొందిన కుటుంబంలో పుట్టి పెరిగింది. దాంతో ఆమె కూడా నృత్యం, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్స్ ను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆహుతి సంస్థ వ్యవస్థాపకురాలి కూడానూ.
ఇక శివశ్రీ స్కంద ప్రసాద్ తంజావూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పట్టాను పొందింది. బయో-ఇంజనీరింగ్ గా గ్రాడ్యుయేట్ అయ్యారు. అలాగే మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ పట్టా కూడా పొందడం విశేషం. ఆ తర్వాత గురు శ్రీ ఏఎస్ మురళి వద్ద శివశ్రీ స్కంద ప్రసాద్ శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. అనంతరం పలు ప్రదర్శనలతో అనేక ప్రతిష్టాత్మక సంగీత అవార్డులను సొంతం చేసుకున్నారు. భరత కళా చూడామణి, యువ సమ్మాన్ అవార్డు, భజన భూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. సంగీతంలోనే కాకుండా.. భరతనాట్యంలో అనే సోలో పెర్ఫామెన్స్ లు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ : పార్ట్ 1'లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శివశ్రీ ఓ సాంగ్ కూడా పాడటం విశేషం.


Click it and Unblock the Notifications











