సినిమాకు వెళ్లి థియేటర్ పైనే కేసు.. రూ.లక్ష పరిహారం ఇచ్చిన యాజమాన్యం!
చలన చిత్ర పరిశ్రమలో కాస్తా మంచి సినిమా వస్తే ఆడియెన్స్ ఏ రేంజ్ లో హిట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెంట్ బాగుంటే చాలు అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే తేడా లేకుండా బ్లాక్ బాస్టర్ చేస్తుంటారు ఆడియెన్స్. ముఖ్యంగా సౌత్ ఆడియెన్స్ కు కంటెంట్ నచ్చితే చాలు సినిమాలను సక్సెస్ బాటల్లో నడిపిస్తారు. సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడితేనే థియేటర్లు బతుకు సాగిస్తాయి. లాభాలను ఆర్జిస్తాయి. అయితే ప్రేక్షక దేవుళ్లకు థియేటర్లలో యాజమాన్యం ఏమేరకు వసతులు కల్పించాలో ఆ మేరకు వసతులు కల్పిస్తూనే ఉంటారు. కొన్ని థియేటర్లు మాత్రం అందుకు విరుద్ధంగా రన్ అవుతుంటాయి.
ముఖ్యంగా ఆడియెన్స్ కు అసౌకర్యమైన ఏర్పాట్లు, సమయానికి సినిమా ప్రారంభం కాకపోవడం, అతిగా యాడ్స్, పార్కింగ్ బిల్స్, నీటి సదుపాయాలు లేకపోవడం, వాష్ రూమ్స్ క్లీన్ గా ఉంచకపోవడం వంటివి అక్కడక్కడా చూసే ఉంటాం. అయితే.. ప్రేక్షకుడు ఎవరికి కంప్లైంట్ చేయకుండానే వెళ్లిపోతుంటాడు. కానీ.. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం సినిమా చూసేందుకు వెళ్లి, తనకు కలిగిన అసౌకర్యానికి థియేటర్ యాజమాన్యంపై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అంతే కాదు పరిహారం కూడా పొందడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ ఎంఆర్ 2023లో 'శ్యామ్ బహదూర్' చిత్రం కోసమని సాయంత్రం 4.05 నిమిషాల షోకు మూడు టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. సినిమా ముగిసే వరకు సాయంత్రం 6:30 నిమిషాలు అవుతుందని అంచనా వేసుకున్నాడు. కానీ సినిమా మాత్రం 4:05కి ప్రారంభం కాకుండా.. 25 నిమిషాలు ఆలస్యంగా 4:30కి షో పడింది. ఈ గ్యాప్ లో అన్నీ రకాల కమర్షియల్ యాడ్స్ ను ప్రదర్శించడంతో అతని సమయం వృథా అయ్యిందని గ్రహించాడు. దాని ద్వారా అతనికి ఉన్న అపాయింట్ మెంట్స్, ఇతర పనులకు హాజరు కాలేకపోయాడని ఫిర్యాదులో పెర్కొన్నాడు.
అలాగే.. థియేటర్ యాజమాన్యం కావాలనే షో టైమ్ ను తప్పుగా ప్రకటించి.. ప్రేక్షకులను ముందుగానే థియేటర్లో కూర్చొబెట్టి కమర్షియల్ యాడ్స్ ను ప్రదర్శించి సొమ్ము చేసుకుంటుందని ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో నమోదైన కేసుపై తాజాగా కన్జ్యూమర్ కోర్టు తీర్పునిచ్చింది. 'సమయాన్ని డబ్బుగా పరిగణిస్తాం' కాబట్టి ఫిర్యాదు దారుడికి పీవీఆర్-ఐనాక్స్ రూ.50000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే ప్రేక్షకులను మానసిక వేదనకు గురిచేస్తున్నందుకు రూ.5000, ఫిర్యాదు ఖర్చులు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే PVR Cinemas, INOXపై నేరుగా మరో లక్ష రూపాయలు జరిమానా విధించింది.

25 నిమిషాల పాటు కమర్షియల్ యాడ్స్ ను రన్ చేసినందుకు థియేటర్ యాజమన్యానికి మొత్తంగా రూ. లక్షా 65లు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేక్షకులే దేవుళ్లుగా భావించే థియేటర్లను ఆడియెన్స్ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. కొంచెం కంటెంట్ బాగున్నా సినిమాను హిట్ చేసి, యాజమ్యానానికి లాభాల వర్షం కురిపిస్తుంటారు. ఈ దృష్ట్యా ఆడియెన్స్ కు కూడా సరైనా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, వారికి సినిమా ద్వారా ఎంటర్ టైన్ మెంట్ అందేలా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపైన ఉంటుంది.


Click it and Unblock the Notifications











