Year Ender 2023: ఈ ఏడాదిలో విడుదలైన బెస్ట్ కొరియన్ సినిమాలివే.. ఒక్కటైనా చూశారా?
మరికొన్ని రోజుల్లో 2023వ సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి మరో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పబోతున్నాం. అయితే ఈ ఏడాది అనేక సినిమాలు వచ్చాయి. ప్రేక్షుకులను ఉర్రూతలూగించాయి. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు కొట్టిన చిత్రాలు కొన్ని అయితే ఎవరూ ఊహించకుండానే ఫ్లాప్ లుగా నిలిచిన చిత్రాలు కొన్ని. వీటిన్నిటినీ కాకపోయినా తమకు నచ్చిన చిత్రాలు అందరూ చూసే ఉంటారు. అలాగే చాలా మంది తెలుగు ప్రేక్షకులు కొరియన్ సినిమాలు చూసేందుకు చాలా ఆసక్తి కనబరుస్తారు. అయితే ఈ ఏడాది వచ్చి సినీ ప్రేక్షకులు ఉర్రూతలూగించిన కొరియన్ చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. అన్ లాక్డ్
ఈ అన్ లాక్డ్ సినిమాలో ఓ అమ్మాయి తన ఫోన్ ను పోగొట్టుకుంది. ఆ తర్వాత అది ఆమెకు దొరుకుతుంది. కానీ అప్పటికే దాన్ని హ్యాక్ చేసి ఆమె గురించి అంతా తెలుసుకుంటారు. అయితే ఆమె వాళ్ల భారి నుంచి తప్పించుకుందా, ఎలా తప్పించుకుంది అనేదే స్టోరీ.

2. జంగ్-ఇ
ఇక ఈ సినిమాలో 22వ శతాబ్దానికి సంబంధించింది. భూమి సరైన నివాస యోగ్యం కాదని తెలిస్తుంది. అప్పుడే అంతర్యుద్ధాలు ప్రారంభం అవుతాయి. వీటిని ఎవరు అడ్డుకున్నారు, ప్రజలను ఎవరు కాపాడారు అనేది ఈ సినిమా కథ.
3. స్మగ్లర్స్
ఈ సినిమాలో ఓ గ్రామంలో రసాయన కర్మాగారం వల్ల అనేక ఇబ్బందులు పడతారు. అక్కడ నుంచి వెళ్లి జీవనోపాధి కోసం అనేక మార్గాలు వెతక్కగా.. చివరగా ఇద్దరు స్మగ్లర్స్ గా మారుతారు.
4. కాంక్రీట్ ఉటోపియా
కాంక్రీట్ ఉటోపియా అనేది విపత్తుకు సంబంధించిన ఓ స్టోరీ. భారీ భూకంపం వల్ల నాశనమైన సియోల్ నగరాన్ని.. అక్కడి ప్రజల జీవితాన్ని చూపిస్తుందీ చిత్రం.
5. పాయింట్ మెన్
అంతర్జాతీయ సంక్షోభం పెరగడంతో పలువురు వేరే దేశాలకు వెళ్లడం.. ఉగ్రవాదులకు దొరకడంతో చాలా ఇబ్బందులు పడతారు. ఈ సమస్యలన్నింటిన ఓ వ్యక్తి చాకచక్యంగా అధిగమిస్తాడు. ఇదే ఈ సినిమా కథ.
6. రీబౌండ్
ఆరుగురు ఆటగాళ్లు జాతీయ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కు సెలెక్ట్ అయ్యేందుకు పడే కష్టాలతో ఈ సినిమాను చూపించారు. నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
7. ఫాంటమ్
1993లో జపాన్ దేశం కొరియాను ఆక్రమించడం.. అదే సమయంలో ఓ ఐదుగురు అరెస్ట్ అవడం జరుగుతుంది. అయితే అందులో నిందితుడిని కనిపెట్టేదే ఈ చిత్రం.

8. ది రౌండప్: నో వే ఔట్
ఏడేళ్ల తర్వాత ఓ హత్య కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తాడో పోలీస్. అయితే అతను ఎదుర్కున్న సమస్యలు, కేసును ఛేదించిన తీరును మనం ఈ సినిమాలో చూడవచ్చు.
9. సోల్ మేట్
11 ఏళ్ల వయసులో కలుసుకున్న ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఈ ప్రేమ ఎలా సాగింది అన్నదాన్ని ఈ సినిమాలో చూడచ్చు.
10. ది మ్యాచ్
ఈ సినిమాలో గో ప్లేయర్ చో హున్ మరియు లీచాంగ్ జీవితాల కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా అందరినీ అలరించింది.


Click it and Unblock the Notifications











