వినూత్న కథాంశంతో భగత్‌సింగ్ నగర్.. లోకల్ టాలెంట్‌తో సరికొత్త ప్రయోగం!
గ్రామీణ నేపథ్యంతో కంటెంట్ బాగుండే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం కేరాఫ్ కంచరపాలెం, RX100 లాంటి చిత్రాలు నిరూపించాయి. లోకల్ టాలెంట్, కొత్త దర్శకుడు, నటీనటుల కలయికలో వస్తున్న చిత్రం భగత్‌సింగ్ నగర్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూస్తే నూతన నటీనటులతో చేసిన ప్రయోగమనే స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై రూపొందిన మూవీలోని నూతన హీరో, హీరోయిన్లను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను జూలై 12న రిలీజ్ చేసింది. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు, దర్శకుడు వాలాజా క్రాంతి, చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
నిర్మాత గౌరీ, రమేష్ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా రూపొందింది. వినూత్నంగా ప్రమోట్ చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అని అన్నారు.

దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ... కథ డిమాండ్ చేయడంతో ఈ మూవీని ఆంధ్రా, తమిళనాడు పరిసర ప్రాంతాలతోపాటు కొన్ని కీలక ఘట్టాలను, కేరళ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాం. మా ప్రీలుక్, ఫస్ట్‌లుక్‌ను ఆదరించినట్టు మా సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. మా వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాం. త్వరలో భగత్‌సింగ్ నగర్ టీజర్‌తో వస్తాం అని అన్నారు.

నటీనటులు : విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు
కథ, కథనం, దర్శకత్వం: వాలాజా క్రాంతి
ప్రొడ్యూసర్స్: వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు
ఛాయాగ్రహణం: రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్: జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్: మునిచంద్ర
నృత్యం: ప్రేమ్-గోపి
నేపథ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి
పిఆర్‌వో: మధు వీఆర్


Click it and Unblock the Notifications











