Bhagavanth Kesari Villain: భగవంత్ కేసరి విలన్ ను చూస్తే బాబోయ్ అనాల్సిందే.. మరి బాలయ్య బాబు ఏమంటాడో?

Bhagavanth Kesari Villain: నటసింహం నందమూరి బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. థియేటర్లలోకి సినిమా వచ్చిందంటే హిట్టు చేసేదాకా వదలరు. 62 ఏళ్ల వయసూలోనూ అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ అందరి చేత ఆహా అనిపిస్తున్న ఈయన తాజాగా భగవంత్ కేసరి అనే సరికొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇందులోనూ మాస్ పాత్రలో కనిపించి అందరినీ మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. బాలయ్య బాబును మాస్ యాంగిల్ లో చూపించే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుంటుంది.

మరి ఇలాంటి చిత్రాల్లో విలన్లను కూడా గట్టిగానే చూపించాల్సి ఉంటుంది. అందుకోసమే భగవంత్ కేసరి చిత్రంలోనూ విలన్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఇదే విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ... బాలయ్య బాబును ఢీకొట్టబోయే విలన్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రాహుల్ సింఘ్వి పాత్రలో అర్జున్ రాంపాల్ అదరగొట్టబోతుండగా.. ఆయన స్టైలిష్ లుక్ మరింతగా ఆకట్టుకుంటోంది. స్టైలిష్ సూట్ లో రాయల్ గా కూర్చొని ఉన్న బాలయ్య బాబు విలన్ ను చూస్తే బాబోయ్ అనకుండా ఉండలేం. మరి ఈ చిత్రంలో ఈ విలన్ ను చూస్తే బాలయ్య బాబు ఏమంటారో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

Bhagavanth Kesari Movie Villain Arjun Rampal First look Realesed By the Movie Team

ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన అభిమానులు.. విలన్ అదిరిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య బాబుకు పోటీగా ఉండాలంటే ఈ మాత్రం సాలిడ్ లుక్ అవసరమంటూ చెబుతున్నారు. మరికొందరేమో.. మనం విలన్ ను చూసి బాబోయ్ అంటున్నానం కానీ.. బాలయ్య బాబు మాత్రం బ్రో ఐ డోంట్ కేర్ అని అంటారని వివరిస్తున్నారు. ఇలా చెప్పడానికి కూడా ఓ కారణం ఉంది లెండి. అదేంటీ అంటారా.. ఈ సినిమా ఉపశీర్షిక "బ్రో ఐ డోంట్ కేర్". ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, రెండు పాటలు విడుదల అయ్యాయి. వాటికి మాంచి బజ్ క్రియేట్ అయింది.

Bhagavanth Kesari Movie Villain Arjun Rampal First look Realesed By the Movie Team

ముఖ్యంగా గణేష్ యాంథమ్ లో బాలయ్య బాబు, శ్రీలీలల డ్యాన్స్ అయితే మస్తుంది. రెండో పాట ఉయ్యాలో ఉయ్యాలలో ఇద్దరి మధ్య బంధాన్ని చాలా చక్కగా వివరించారు. ఇక ఆదివారం రోజు రాత్రి 8.16 గంటలకు రాబోయే ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులంతా ఉవ్విళ్లూరుతున్నారు. అప్పటి వరకూ ఆగాలా ఈరోజే రిలీజ్ చేయండి అంటూ బాలకృష్ణ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Bhagavanth Kesari Movie Villain Arjun Rampal First look Realesed By the Movie Team

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా కనిపించబోతున్నారని సమాచారం. గిరిజనుల్లో ఒకరిగా ఉంటూ.. సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై కూడా నటసింహం ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది. అలాగే అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ గా మారిన శ్రీలీల కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. శరత్ కుమార్, నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X