హరికృష్ణ మూవీకి రీమేక్‌గా భగవంత్ కేసరి.. ఇదిగో అసలైన క్లారిటీ వచ్చేసింది!
చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయినా.. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీనియర్ హీరో 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడి రూపకల్పనలో నటసింహా నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమే 'భగవంత్ కేసరి'. క్రేజీ కాంబినేషన్‌లో విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతుండడంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

'భగవంత్ కేసరి' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చినా.. ఇప్పుడు మాత్రం చిత్రీకరణ శరవేగంగానే సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. దీన్ని దసరా బరిలో నిలపబోతున్నారు.
బాలయ్య కెరీర్‌లోనే సరికొత్త కాన్సెప్టుతో రాబోతున్న 'భగవంత్ కేసరి' సినిమాపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీపై పుకార్లు చాలానే షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా గతంలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించిన 'స్వామి' సినిమాకు అనధికారిక రీమేక్‌గా వస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
'భగవంత్ కేసరి' మూవీ స్వామికి రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై తాజాగా నిర్మాతలు స్పందించారు. ఈ మేరకు షైన్ స్క్రీన్స్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో ఓ వెబ్‌సైట్ పోస్ట్ చేసిన న్యూస్‌ను షేర్ చేస్తూ.. 'ఇది నిజం కాదు.. అసలు నిజం ఏంటంటే.. అక్టోబర్ 19న భారీగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ బిగ్ స్క్రీన్స్‌పై గతంలో ఎన్నడూ చూడని బాలయ్యను చూడబోతున్నారు' అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో రీమేక్ వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లు అయింది.
ఇదిలా ఉండగా.. నటసింహా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతోన్న 'భగవంత్ కేసరి' మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కాబోతుంది. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











