Bhagavanth Kesari twitter Review శ్రీలీల కెమిస్ట్రీ ఎలా ఉందంటే? కాజల్ ఫెర్ఫార్మెన్స్ ...

నటసింహం నందమూరి బాలకృష్ణ, గ్లామర్ క్వీన్ శ్రీలీల, అందాల భామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించిన చిత్రం భగవంత్ కేసరి. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సైన్ షైన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాపై నెటిజన్లు ట్విట్టర్‌లో వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

భగవంత్ కేసరి సినిమా ప్రీమియర్లు అమెరికాలో భారతీయ కాలమానం ప్రకారం 18వ తేదీ అర్ధరాత్రి మొదలవుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఉదయం 4.30 గంటలకు ప్రీమియర్ అవుతున్నాయి. బెంగళూరులో ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లు భారీగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

Bhagavanth Kesari twitter Review: Here is the Netizens Response on Balakrishna, Sreeleela, Kajal Aggarwal movie

భగవంత్ కేసరి రెగ్యులర్‌గా, టిపికల్‌గా వచ్చే బాలకృస్ణ సినిమా కాదు. బాలయ్య ఎంట్రీ, కామెడీ ట్రాక్‌తో సినిమా మంచిగా ఉంటుంది. బాలయ్య, శ్రీలీల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్ సూపర్‌గా ఉంది. విలన్ క్యారెక్టర్ రొటీన్‌గా ఉంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే కొన్నీ సిన్లతో అసలు కథ మొదలైనట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా బాగుంది.

బాలయ్య ఫ్యాన్స్‌కు ట్రీట్ లాంటి సినిమా. బాలయ్య యాక్టింగ్‌ను విమర్శించే వారికి చెంపపెట్టు. థమన్ మ్యూజిక్ బాగుంది. కానీ వీరసింహారెడ్డి రేంజ్‌లో లేదు. శ్రీలీల ఇరగదీసింది. చిరంజీవి అంటే మాకు గౌరవం. కానీ బాలయ్యను చూసి నేర్చుకోవాలి అని ఓ అభిమాని పోస్టు పెట్టాడు.

వెండితెర మీద బాలయ్య, శ్రీలీల కెమిస్ట్రీ పండింది. స్క్రీన్ మీద వారిద్దరూ నిజంగా తండ్రి కూతుళ్లా అనే ఫీలింగ్‌ను కల్పించారు. ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ కాంబినేషన్. భావోద్వేగాన్ని రగిలించే సన్నివేశాలు ఉన్నాయి. ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ భగవంత్ కేసరి అంటూ ఓ ట్వీట్ కనిపించింది.

హిందూ ధర్మానికి కేసరి సూచిక. హిందుత్వానికి కేసరి చిహ్నం. నీవు హిందువైతే కేసరి అంటే కేవలం రవ్వ కేసరి అని తెలియదు. ఎలాగైతే హిందుత్వ స్ట్రాంగ్‌ అనిపిస్తుందో.. అలాగే బాలకృష్ణ కూడా స్ట్రాంగ్ అని భగవంత్ కేసరి మూవీలో నిరూపించారు. ఈ సినిమా మహిళా సాధికారితకు కచ్చితమైన నిర్వచనం అని ఓ అభిమాని ఎమోషనల్ అయ్యాడు.

భగవంత్ కేసరి సినిమాను దర్శకుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అభిమానులకు పంచభక్షపరమాన్నంలా ుంది. ప్రతీ 15 నిమిషాలయు ఓ సర్‌ష్రైజ్ ఉంటుంది. టీ వేడి చేసే సీన్‌లో బాలయ్య ఇరగదీశాడు. టన్నెల్ సీన్‌ భగవంత్ కేసరి సినిమాకు హైలెట్‌గా నిలిచింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

భగవంత్ కేసరి సినిమా బాగుంది. శ్రీలీల, బాలయ్య కాంబినేషన్ అదిరింది. క్లైమాక్స్‌లో ఇద్దరు చెలరేగిపోయారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బాలయ్య ఎంట్రీ సీన్ అదిరిపోయింది.

అనిల్ రావిపూడి గత సినిమాలతో పోల్చుకొంటే భగవంత్ కేసరి సినిమా ఒకేలా అనిపిస్తుంది. అక్కడక్కడా సినిమా బాగుందనిపిస్తుంది. తెలంగాణ యాస, భాష, బ్యాక్ డ్రాప్ సినిమాలో సూపర్బ్. సినిమాలో సన్నివేశాలు ఊహించుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. యాక్షన్ బ్లాక్, ఎమోషన్స్ బాగా ఉన్నాయి. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ ఎక్సలెంట్. అనిల్ రావిపూడి డైరెక్షన్ స్మార్ట్‌గా ఉంది. బొమ్మ హిట్టు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కుమ్మేశాడు. ఆయన నటించిన సినిమాల మాదిరిగా టిపికల్‌గా లేదు. బాలయ్య ఎలివేషన్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ సినిమా డీసెంట్ ఫిల్మ్. నాకు బాగా నచ్చింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

బాలయ్య ఓ జైలర్ లాంటి సినిమా అయ్యే అవకాశం మిస్ అయింది. తమన్ బీజీఎం బాగాలేదు. సినిమాను బీజీఎం పరంగా పడుకో బెట్టాడు. వచ్చే సంక్రాంతికి మా బొమ్మ గురించి తలుచుకొంటే భయమేస్తున్నది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

భగవంత్ కేసరి సినిమా చూశాను. నాకు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ నచ్చలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. కొన్ని చోట్ల తమన్ మ్యూజిక్ బాగుంది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ వర్కవుట్ అయిందనే చెప్పాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

భగవంత్ కేసరి సంతృప్తిని కలిగించే కమర్షియల్ ఎంటర్‌టైనర్. కామెడీ వర్కవుట్ కాలేదు. కొన్ని సీన్లు చాలా ల్యాగ్ ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. తమన్ బీజీఎం ఒకేలా ఉంది. కానీ ఫర్వాలేదనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చూడని బాలయ్యను, కొత్తగా బాలకృష్ణను చూస్తారు. ఇటీవల కాలంలో బాలయ్య చేసిన మంచి సినిమా. బాలయ్య నట విశ్వరూపాన్ని చూస్తారు అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ వద్ద మాస్ బ్లాక్ బస్టర్ అందుకోవాలి. భగవంత్ కేసరి భారీ హిట్ సాధించాలి అని మహేష్ బాబు ట్రెండ్స్ ట్వీట్ చేశారు.

మా అభిమాన నటుడు బాలయ్యకు ఆల్ ది బెస్ట్. అనిల్ రావిపూడికి, భగవంత్ కేసరి టీమ్‌కు, డార్లింగ్ తమన్‌కు భారీ విజయం దక్కాలని వేడుకొంటున్నాను అని వరలక్ష్మీ శరత్ కుమార్ ట్వీట్ చేశారు.

భగవంత్ కేసరి సినిమా రిలీజ్ ముందు షైన్ స్క్రీన్ బ్యానర్ ట్వీట్ చేస్తూ.. ఇంతకుముందెన్నడూ చూడని ఎమోషన్స్.. ఇంతకు ముందు ఎన్నడూ పొందని అనుభూతిని నందమూరి బాలకృష్ణ ద్వారా పొందుతారు. భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది అని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X