Anil Ravipudi: అనిల్ రావిపూడికి భగవంత్ కేసరి ప్రొడ్యూసర్ కాస్ట్లీ గిఫ్టు.. ఏంటో తెలుసా?

ఏవైనా సినిమాలు హిట్టుగా నిలిచి భారీ స్థాయిలో లాభాలు వచ్చినప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్లు.. హీరోహీరోయిన్లకు, నటులకు, డైరెక్టర్లకు కాస్ట్లీ గిఫ్టులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. భారీ లాభాలు వచ్చినప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు ఇలాగే చేస్తుంటారు. తాము పెట్టిన డబ్బులకు ఎక్కువ లాభాలు వచ్చేలా కృషి చేసిన వారికి తమ కృతజ్ఞతలను ఈ విధంగా తెలుపుతుంటారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి.. ఆ చిత్ర నిర్మాత ఓ కాస్ట్లీ గిఫ్టు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. భారీ అంచనాల మధ్య చాలా గ్రాండ్ గా అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ముందు నుంచీ అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ సినిమా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కూడా రాబట్టింది. దాదాపు ఐదు వారాల పాటు థియేటర్లలో ఆడిన ఈ చిత్రం బాక్సాఫీసును కొల్లగొట్టిందనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకోవడంతో పాటు భారీ స్థాయిలో లాభాలను రాబట్టుకుంది.

Bhagavanth KesariMovie Producer Special Costly Gift to Director Anil Ravipudi Check Details

అంతేకాకుండా అందరూ మెచ్చే రీతిలో రూపొందిన 'భగవంత్ కేసరి' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఇండియా మొత్తంలో టాప్ సినిమాగా ట్రెండ్ అవుతూ రికార్డు సృష్టిస్తోంది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికగా కూడా హిట్టుగా నిలుస్తున్న ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా అఖండ, వీర సింహారెడ్డిల తర్వాత చేసిన ఈ సినిమా హిట్టు కాగా.. బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ పడింది.

అలాగే భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన టాలీవుడ్ నటి అందాల చందమామ కాజల్ అగర్వాల్, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీలకు కూడా ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇలా నటీనటులు, డైరెక్టర్ లకు మంచి పేరు తేవడంతో పాటు ప్రొడ్యూసర్లకు పెద్ద ఎత్తున లాభాలు తెచ్చిపెట్టింది భగవంత్ కేసరి చిత్రం.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది కలసి నిర్మించిన ఈ సినిమా డైరెక్టర్ కు ఓ స్పెషల్ గిఫ్టు ఇచ్చారు. కోటి రూపాయలకు పైగా విలువ చేసే కారును ఈరోజు అందజేశారు. నేరుగా నిర్మాత సాహూ గారపాటియే వెళ్లి... టయోటా వైల్ ఫైర్ కారును అనిల్ రావిపూడికి బహుమతిగా ఇచ్చారు. తాళాలు అందజేస్తూ దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అటు బాలయ్య బాబు ఫ్యాన్స్ తో పాటు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X