ఒక్క సినిమాతోనే సెన్సేషన్ .. భాగ్యశ్రీకి దెబ్బ మీద దెబ్బ?
సినీ పరిశ్రమలోని నటీనటుల్లో కేవలం కొందరికి మాత్రమే కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే మంచి ఫేమ్‌ని పొందే అదృష్టం దక్కింది అని చెప్పాలి. అలాంటి వారిలో ఓవర్ నైట్‌లోనే ఒక్కసారిగా మంచి ఫేమ్ ని తెచ్చుకున్న హీరోయిన్స్ లో రీసెంట్ టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకామె అని చెప్పాలి.
కాగా ఈమె మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం "మిస్టర్ బచ్చన్"లో హీరోయిన్‌గా చేసింది. ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా రిలీజ్‌కి ముందే కావాల్సిన అటెన్షన్ ని తెచ్చేసుకుంది. అంతేకాదు.. రిలీజ్‌కి ముందే తెలుగులో తన హాట్ షో అలాగే తన అంద చందాలతో భాగ్యశ్రీ అలరించింది.

కట్ చేస్తే.. ఈ సినిమా రిలీజైంది. ఆమెకి మంచి మార్కులు కూడా వచ్చాయి . అలాగే వాటితో పాటుగా పలు కాంట్రవర్సీలు కూడా ఈమె అందుకుంది. అయితే ఈమె నటించిన ఈ సినిమా తెలుగులో భారీ డిజాస్టర్ అయింది. దీనితో భాగ్యశ్రీకి స్టార్టింగ్‌లోనే డిజప్పాయింటింగ్ వెల్కమ్ దక్కిందని చెప్పొచ్చు. ఆ నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నకి హీరో రామ్ పోతినేనితో ఈమె నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
ఫస్ట్ సినిమా ప్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీకి మరిన్ని సాలిడ్ ఆఫర్స్ కూడా వచ్చాయట. కానీ వీటి నుంచి ఆమెని మేకర్స్ తప్పించినట్టుగా ఫిలింనగర్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా భాగ్యశ్రీ బోర్సే.. ఇద్దరు యువ హీరోలు అది కూడా మిడ్ రేంజ్ మార్కెట్ ఉన్న హీరోస్ సినిమాల్లోనే మంచి ఆఫర్స్ ని అందుకుందట.

కానీ వరుసగా ఈ సినిమాలు నుంచి మళ్ళీ ఆమె దూరం అయ్యినట్టుగా వినిపిస్తుంది. దీనితో భాగ్యశ్రీకి దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటిలో మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా కూడా ఉందట. ఈమె సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటుందట. పైగా మొదటి సినిమా ప్లాప్ కావడంతో స్క్రిప్ట్స్ పరంగా మేకర్స్‌తో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది అని తెలుస్తుంది.
దీనితో వరుసగా దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఉస్తాద్ రామ్ పోతినేనితో భాగ్యశ్రీ ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా తర్వాత తన నుంచి ఎలాంటి సినిమాలు ఉంటాయో లేదో చూడాలి మరి. కాగా తెలుగు సినిమా సహా తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ ఈమెకి వస్తున్నాయి అని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ మిస్టర్ బచ్చన్ ప్లాప్ అయ్యేసరికి అవన్నీ బ్రేక్ తీసుకున్నాయి. కానీ ఈమె హిందీలో నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ లో నటించి అక్కడ హిట్ అందుకుంది. కానీ సౌత్‌లో మాత్రం స్ట్రగుల్ అవుతుంది అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











