నాపై ప్రభాస్‌కు అలాంటి ఫీలింగ్ ఉందని ఎదురుగానే చెప్పాడు: 50 ఏళ్ల సీనియర్ నటి

ప్రభాస్ ఇటీవల 41వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఇంకా యువ హీరోలు మాదిరిగానే కనిపిస్తున్న రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. మొన్నటి వరకు రూమర్స్ ఎన్ని వినబడినా కూడా హాట్ టాపిక్ గా నిలిచేవి. కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఇక ఒక సీనియర్ నటిపై ప్రభాస్ కి చాలా క్రష్ ఉందట. ఆ విషయాన్ని ఆ నటి చెప్పడం విశేషం.

రాధేశ్యామ్ షూటింగ్ లో సరదాగా..

రాధేశ్యామ్ షూటింగ్ లో సరదాగా..

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఉంటే అందరితో సరదాగా గడపడం అలవాటు. అలాగే రాధేశ్యామ్ సెట్ లో కూడా ఒక వైపు వర్క్ కోసం కష్టపడుతూనే మరోవైపు నటీనటులతో సరదాగా గడుపుతున్నాడట.

ఆమెతో ప్రభాస్ ముచ్చట్లు

ఆమెతో ప్రభాస్ ముచ్చట్లు

ఇక రాధేశ్యామ్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సీనియర్ బాలీవుడ్ నటి ప్రభాస్ గురించి మాట్లాడింది. ఆమె మరెవరో కాదు. అటు బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలతో మెప్పించిన నటి భాగ్యశ్రీ. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చాలా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక షూటింగ్ లో ఆమె ప్రభాస్ తో ఎక్కువగా మాట్లాడుతున్నారట.

సీనియర్ నటిపై ప్రభాస్ క్రష్

సీనియర్ నటిపై ప్రభాస్ క్రష్

అంతే కాకుండా ప్రభాస్ ఎప్పటి నుంచో నాపై క్రష్ ఉందని చెప్పినట్లు భాగ్యశ్రీ వివరణ ఇచ్చింది. అంత పెద్ద స్టార్ హీరో ఎంతో అభిమానం చూపడంతో బాగ్యశ్రీ కూడా చాలా సంతోషించిదట. ఇక షూటింగ్ లో రాధేశ్యామ్ టీమ్ తనను ఎంతో బాగా చూసుకుంటున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాతలు ఎప్పటికప్పుడు నాకు ఇబ్బంది కలగకుండా షూటింగ్ సమయంలో ఎంతగానో సపోర్ట్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

Recommended Video

#BeatsOfRadheShyam : New Motion-Poster Released From Radhe Shyam
మరో షెడ్యూల్ ఎక్కడంటే..?

మరో షెడ్యూల్ ఎక్కడంటే..?

ఇక ప్రస్తుతం యూరప్ లోనే ఉన్న రాధేశ్యామ్ టీమ్ త్వరలో హైదరాబాద్ కి రానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొన్ని సెట్స్ లలో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారట. ఇటీవల విడుదలైన సినిమా మోషన్ పోస్టర్ కి ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలవడం కాయమని టాక్ వస్తోంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X