ప్రభాస్ సినిమాలో సీనియర్ హీరోయిన్.. తల్లి పాత్ర అంటే నమ్ముతారా?
రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి తరువాత దర్శకనిర్మాతలను ఒక విదంగా కష్టపెడుతున్నాడనే చెప్పాలి. మిర్చి వరకు స్టార్ హీరోగానే ఉన్న ప్రభాస్ ఆ తరువాత అంతకు మించి అనే స్థాయిలో బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా సిద్ధమయ్యాడు. దీంతో ఆయనతో వర్క్ చేయబోయే దర్శకనిర్మాతలు కూడా అంతకు మించి అనేలా సినిమా కోసం కష్టపడుతున్నారు.
ప్రభాస్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయినా చిన్న క్యారెక్టర్ అయినా సినిమా స్థాయిని పెంచేలా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇక నెక్స్ట్ రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీలో కూడా అదే తరహాలో సినీ తారలు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక ముఖ్యమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీని సెలక్ట్ చేసుకున్నారు.

అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల భాగ్య శ్రీ క్లారిటీ ఇచ్చారు. 50ఏళ్ళ భాగ్య శ్రీ ఇంకా యంగ్ గానే కనిపిస్తు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటారు. ఆమెకు పెళ్లికొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారంటే ఎవరు నమ్మరు. అంతగా తన హాట్ గ్లామర్ తో ఇప్పటికి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ఇకపోతే ప్రభాస్ సినిమాలో ఈ సీనియర్ బ్యూటీ తల్లి పాత్రలో నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ పాత్ర ద్వారా భాగ్య శ్రీ ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











