అరవై కోట్ల భారీ బడ్జెట్‌తో.. భక్త కన్నప్పగా మంచు విష్ణు .. మోహన్ బాబు ప్రకటన

తెలుగు సినీ చరిత్రలో భక్త కన్నప్ప చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. భక్త కన్నప్పగా కృష్ణం రాజు ఒదిగిపోయిన తీరుకు.. ఓ క్లాసిక్‌గా మిగిలిపోయింది. అయితే ఈ చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించేందుకు మోహన్ బాబు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప చిత్రం వస్తుందని చెప్పుకుంటూ వచ్చినా.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా ఈ విషయమై మోహన్ బాబు అధికారికంగా ప్రకటన చేశాడు.

మహాశివరాత్రి పర్వదినాన..

మహాశివరాత్రి పర్వదినాన..

మహాశివరాత్రి పర్వదినాన తన జన్మ రహస్యం, తన పుట్టుకకు శివుడికి ఉన్న బంధాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు పిల్లలు పుట్టకపోవడంతో ఎవరో చెప్పడంతో అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కడంతో తాము పుట్టామని అందుకే తనకు భక్త వత్సలం అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చాడు.

 మా కుటుంబమంతా శివ కటాక్షమే..

మా కుటుంబమంతా శివ కటాక్షమే..

తనకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం అదేనని చెప్పుకొచ్చాడు. తాను ఆయన ఆశీస్సులతో పుట్టినవాడినని, తమ కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్ళమేనని చెప్పుకొచ్చాడు. ఇక మహాశివరాత్రి సందర్భంగా మోహన్ బాబు శ్రీకాళహస్తిని సందర్శించాడు. ఆ పుణ్యక్షేత్రంలోనే తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.

ముందుకు కదిలిన భక్త కన్నప్ప..

ముందుకు కదిలిన భక్త కన్నప్ప..

తనకు శివుడి మీదున్న ప్రేమతోనే భక్త కన్నప్ప ప్రాజెక్ట్ గురించి అంతగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల నుంచి నాన్చుతూ వస్తున్న ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు ఓ అధికారిక ప్రకటన వచ్చేసింది. మోహన్ బాబు నోటి వెంటే ఈ మాటలు రావడంతో.. సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Director Karthik Reddy Made Serious Allegations On Manchu Vishnu || Filmibeat Telugu
 దాదాపు అరవై కోట్ల బడ్జెట్..

దాదాపు అరవై కోట్ల బడ్జెట్..

అయితే కేవలం ప్రాజెక్ట్‌ను మాత్రమే ప్రకటించకుండా దాని బడ్జెట్‌ను కూడా ముందే చెప్పేశాడు మోహన్ బాబు. రూ. 60 కోట్లతో ఈ పౌరాణిక చిత్రాన్ని నిర్మించబోతోన్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X