Liger పూరి జగన్నాథ్ మాటల్లో తప్పు లేదు.. డిస్టిబ్యూటర్లకు షాకిచ్చిన తమ్మారెడ్డి
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా నష్టాలను కలుగజేసింది.
అయితే ఈ సినిమా వలన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా పూరి జగన్నాథ్ కొంత నష్టాలను భరించాలి అని డబ్బు వెనక్కి ఇవ్వాలి అని ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఊహించిన విధంగా పూరి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత తమ్మ భరద్వాజ తన దైన శైలిలోకి క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

నష్టాలు రావడంతో
పూరి జగన్నాథ్ చార్మి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లైగర్ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను చూసుకున్నారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ ముందుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లైగర్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. అయితే సినిమా ఊహించని స్థాయిలో నష్టాలను కలిగించడంతో కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలి అని అనడంతో ఈ క్రమంలో పూరి కూడా ఇస్తానని ఒక మాట అయితే ఇచ్చాడు.

పూరి సీరియస్ కామెంట్స్
అయితే పూరి జగన్నాథ్ ఒక నెల రోజుల్లో ఇస్తాను అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా తొందరగా ఇవ్వడం లేదని పూరి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పూరి జగన్నాథ్ ఒక ఆడియో విడుదల చేస్తూ ఎవరైతే ధర్నా చేస్తారో వాళ్లకు ఇవ్వను అని ఇస్తాను అని చెప్పినప్పుడు కాస్త ఓపిక పట్టాలి అని కూడా ఆయన అన్నారు. అంతే కాకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా పూరి సీరియస్ గా ఒక హెచ్చరిక అయితే చేశారు.

గతంలో కూడా..
ఇక పూరి స్పందించిన విధానంపై కొందరు విభిన్నంగా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా పూరి జగన్నాథ్ మాటల్లో ఎలాంటి తప్పులేదు అని తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో పూరి జగన్నాథ్ నేనింతే సినిమా సమయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఇదే తరహాలో ధర్నా చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ వివాదం అందరూ మర్చిపోయారని అన్నారు.

వాళ్ళే కొనుగోలు చేశారు
ఇప్పుడు లైగర్ కు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే పూరి జగన్నాథ్ మాటల్లో మాత్రం పెద్దగా తప్పు ఏమీ లేదు. ఎందుకంటే అతను ఎవరి దగ్గరకు వెళ్లి సినిమాలో అమ్మలేదు. ఎగ్జిబిటర్ లో డిస్ట్రిబ్యూటర్లు అందరూ వచ్చినప్పుడు నేను ఒక సినిమా తీశాను దాన్ని ఈ ధరకు అమ్ముతున్నాను అని చెప్పినప్పుడు వాళ్లే నచ్చి కొనుగోలు చేశారు.. అన్నారు.

చట్టప్రకారంగా వెళితే..
ఒక విధంగా లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ చెప్పిన రేటుకు కొనడం కొనకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఈ సినిమాలో ఎక్కువ ధరకు కొనడం అనేది వాళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్. అయితే ఈ విషయంలో పూరి జగన్నాథ్ తప్పులేదు. లైగర్ సినిమాను వారు వచ్చిన ధరకు కొనుగోలు చేసి విడుదల చేశారు. ఇక ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని పూరి జగన్నాథ్ దాన్ని భరించాలి అంటే న్యాయం ఎలా అవుతుంది. చట్టప్రకారంగా వెళితే పూరి జగన్నాథ్ డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











