twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు మాతృ వియోగం.. చిరంజీవి ఓదార్పు

    |

    ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు.

    ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.

    Bharadwaja Thammareddy mother Krishna Veni no more

    ఫోన్‌లో తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. కృష్ణ‌వేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే. మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భ‌ర‌ద్వాజ‌ను ప‌రామ‌ర్శించారు, ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సంతాప సందేశాన్ని తెలియ‌జేశారు. సినిమా ఒక మ‌జిలీ.. స‌మ స‌మాజం నా అంతిమ ల‌క్ష్యం అనే కృష్ణ‌మూర్తి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఇతోదిక సేవ‌లందించారని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

    కాగా, తమ్మారెడ్డి తల్లి మరణవార్త తెలుసుకొన్న వెంటనే పలువురు సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలు ఆయనను పరామర్శించారు. నగరంలో కరోనా పరిస్థితులు భయంకరంగా ఉండటం వలన ఆయనను ఫోన్‌లోనే పరామర్శిస్తున్నారు.

    English summary
    Bharadwaja Thammareddy mother Krishna Veni no more. She suffering with illness since couple of months. on this sad moments, Chiranjeevi condoles Tammareddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X