చాలామంది గురించి తెలుసు.. నోరు విప్పితే చాలా ఉన్నాయి.. నాగబాబు మాటలకు తమ్మారెడ్డి రియాక్షన్

ఇటీవల RRR సినిమా సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంతో చాలా మంది సినీ ప్రముఖులు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. అయితే ఆస్కార్ నామినేషన్ కోసం దాదాపు 80 కోట్లు ఖర్చు చేశారు అనే ఒక వార్త కూడా వైరల్ అయింది. ఇక ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఆదే తరహాలో కామెంట్ చేయడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు సీరియస్ అయ్యారు. ముఖ్యంగా నాగబాబు కాస్త ఘాటుగా స్పందించడంతో తమ్మారెడ్డి భరద్వాజ వెంటనే వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడిన వివరాల్లోకి వెళితే..

క్షమాపణ చెప్పడానికి రాలేదు

క్షమాపణ చెప్పడానికి రాలేదు

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను క్షమాపణ చెప్పడానికి రాలేదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు ఇండస్ట్రీ తరపున ప్రతిసారి నేను మాట్లాడుతూనే ఉంటాను. అయితే నేను నిన్న మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. దాదాపు మూడు గంటల పాటు ఒక సెమినార్ జరిగింది. చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు ఉన్న వ్యత్యాసం గురించి చెబుతూ కొన్ని చిన్న సినిమాలు ఎందుకు విడుదల కావు అనే విషయం గురించి కూడా చెప్పడం జరిగింది.. అని తమ్మారెడ్డి తెలియజేశారు.

చాలా గొప్పగా చెప్పాను

చాలా గొప్పగా చెప్పాను

ఈ వివాదం కంటే ముందుగానే నేను RRR సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాను. ఆ సినిమా దేశానికి గర్వకామని రాజమౌళి గారికి హ్యాట్సాఫ్ కూడా చెప్పాను. అది ఎంతమంది చూశారో నాకు తెలియదు. కానీ నేను RRR గురించి నిన్న చేసిన కామెంట్స్ గురించి కొంతమంది సినీ ప్రముఖులు వివిధ రకాలుగా మాట్లాడారు. నేను సినిమా స్థాయిని బట్టి తీసే బడ్జెట్ను బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవాలని దాని గురించి మాత్రమే మాట్లాడను కానీ RRR గురించి తప్పుగా మాట్లాడలేదు.. అని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.

చాలామంది అకౌంట్లు తెలుసు..

చాలామంది అకౌంట్లు తెలుసు..

రాజమౌళి గారు చూసి జలస్ ఫీల్ అవుతున్నాను అని కొంతమంది అంటున్నారు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను అసలు అది అర్థం లేని మాట. బయట వాళ్ళు అంటే నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఇండస్ట్రీలోని పెద్దవాళ్లు అలా మాట్లాడడంతో నేను రియాక్ట్ కావాల్సి వస్తుంది. అకౌంట్స్ తెలుసా అని అడిగారు. నాకు చాలామంది అకౌంట్లు తెలుసు. అవి చెప్పనవసరం లేదు. కానీ చాలామంది అకౌంట్స్ తెలుసు.. అని తెలిపారు.

అన్ని విషయాలు నాకు తెలుసు

అన్ని విషయాలు నాకు తెలుసు

ఎవడెవడు ఎవడిని ఏ అవార్డులకు ఆడుక్కున్నారో ఏ పదవుల కోసం ఏమనుకున్నారో.. ఎవరెవరు ఎవరి కాళ్లపై పడ్డారో అనే విషయం కూడా నాకు తెలుసు. కానీ వాటిపై ఎప్పుడు మాట్లాడలేదు. ఇలా మాట్లాడితే ఇండస్ట్రీ పరువు రోడ్డున పడేయడం నాకు సాధ్యమవుతుంది కానీ నేను ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఇండస్ట్రీ అంటే నా తల్లి ఎప్పుడు దాన్ని గౌరవిస్తాను. అని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.

 నిజాలు ఏంటో చెబుతారా?

నిజాలు ఏంటో చెబుతారా?

నీ అ..* మొగుడు అని కొందరు అంటారు.. నాకు మా అమ్మ కూడా నీతి నిజాయితీ నేర్పించారు. మీకు అలానే నేర్పించారా? మీరు చేసిన నిజాలు ఏంటో చెబుతారా? మీ కులాల గురించి పట్టించుకుంటారు. మీరా నా గురించి మాట్లాడేది. చాలా బూతులు మాట్లాడొచ్చు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు సంస్కారం అడ్డం వస్తుంది. మూడు గంటలు నేను ఏం మాట్లాడనో వినకుండా ఒక రెండు నిమిషాల క్లిప్ చూసి తిడుతున్నారు.. అని అన్నారు.

నాకేమీ నష్టం లేదు..

నాకేమీ నష్టం లేదు..

నాకేమీ నష్టం లేదు. నేను ఇప్పుడే సెలబ్రిటీని అయిపోయాను. మీరు తిట్టిన మాటలకు మీరు సిగ్గుపడాలి. నేనేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేయలేదు. నేను నోరు విప్పితే చాలా ఉంటాయి. కానీ అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ ఒకటి కాబట్టి నేను ఫీల్ అయ్యాను. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుకోండి. కానీ నేను అవి ఏమి పట్టించుకోను... అని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X