2024 AP elections: టాలీవుడ్ హీరోకు ఓటర్ల ఝలక్.. బాధతో కౌంటింగ్ కేంద్రం నుంచి ఔట్

ఇండియాలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడీవేడిగా సాగుతుంటాయి. ముఖ్యంగా ఇక్కడి అసెంబ్లీ ఎన్నిలకపై ఎంతో హైప్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి దిగాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ నేడు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోకు బిగ్ షాక్ తగిలింది. ఆ హీరో ఎవరో మీరే చూసేయండి!

ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను సైతం దాటేయడంతో పాటు భారీ మెజారిటీ సాధించేలా వెళ్తోంది. తద్వారా ఈ మూడు పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి అడుగులు వేస్తోంది.

Bharat Margani Trail In AP Elections 2024 and Left From Counting Room

ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌లో చాలా మంది ప్రముఖులు కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సినిమాలో హీరోగా నటించి, 2019 ఎన్నిల్లో ఎంపీగా విజయం సాధించిన మార్గాని భరత్ ఈ సారి రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వెనుకంజలో పడిపోయారు.

2019 ఎన్నికల్లో ఎంపిగా గెలిచిన మార్గాని భరత్‌కు ఈ సారి రాజమండ్రి సిటీ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. ఇందులో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై ఆయన పోటీ చేశారు. తాజాగా వెలువడుతోన్న ఫలితాల్లో మార్గాని భరత్ చాలా ఓట్లు వెనుకంజలో ఉండిపోయారు. దీంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేసినట్లు తాజాగా తెలిసింది.

ఇదిలా ఉండగా.. మార్గాని భరత్ అమెరికాలో చదువుకుని.. ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ సమయంలోనే 'ఓయ్ నిన్నే' అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచారు. కానీ, ఇప్పుడు మాత్రం ఓటమి దిశగా వెళ్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X