Bharathanatyam Teaser Review ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో భరతనాట్యం.. గంగవ్వ పంచ్ అదిరిందిగా.. టీజర్ రివ్యూ
దొరసాని సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కేవీ మహేంద్ర రూపొందిస్తున్న చిత్రం భరతనాట్యం. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఆర్టిస్ట్, పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయమవుతున్నారు. హీరోయిన్‌గా మీనాక్షి గోస్వామి నటిస్తున్నారు. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా భరత నాట్యం టీజర్‌ను మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే?
సినిమా పరిశ్రమలో దర్శకుడు కావాలనుకొనే ఓ యువకుడి కథ అనే విషయాన్ని టీజర్ స్పష్టం చేసింది. అలాగే కిరాయి గుండాలు, విలన్ల మధ్య ఫన్నీ కామెడీ సీన్లు కూడా ఆకట్టుకొన్నాయి. హర్షవర్ణన్ విలనిజం.. వైవా హర్ష, అజయ్ ఘోష్, గంగవ్వ, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరుల క్యారెక్టర్లు ఇంట్రెస్టింగగా కనిపించాయి. కమర్షియల్ అంశాలు, కామెడీని జోడించి తీరు టీజర్‌కు ప్లస్ పాయింట్‌గా మారాయి.

ఔత్సాహిక యువ దర్శకుడి జీవితంలో పేద అమ్మ, పేద నాన్న, శాడిస్ట్ గర్ల్‌ఫ్రెండ్. అలాంటి దరిద్రంలో నుంచి బయపపడటానికి హీరో ఓ తప్పు చేయడానికి సిద్దపడుతాడు. ఆ తప్పు వల్ల యువ దర్శకుడి జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకొన్నాయి? ఆ ట్విస్టులు, సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనే విషయం టీజర్ ద్వారా తెలియపరిచారు. ఎమోషన్స్‌తోపాటు కామెడీ కూడా ఎక్కువ స్థాయిలో ఉండేలా చూసుకొన్నట్టు కనిపించింది.
ఆశను మించింది అత్యాశ.. ఎవడైతే అత్యాశకు పోతాడు.. మనిషి చడిపోవడానికి అంతకంటే ఏమీ ఉండదనే జీవిత సత్యాన్ని హర్షవర్దన్ క్యారెక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.ఇక టీజర్‌లో గంగవ్వ ఇచ్చిన పంచ్ బాగుంది. అందరూ భరతనాట్యం కావాలి అంటూ ఎక్స్‌ప్రెషన్ కావాలంటూ ఇచ్చిన డైలాగ్ క్యూరియాసిటిని క్రియేట్ చేసింది. ఇక సూర్య తేజ ఏలే తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకొనేంతగా నటించాడనే విషయం టీజర్‌లో కనిపించింది.

ఓవరాల్‌గా భరత నాట్యం టీజర్ మాత్రం సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే దర్శకుడు కేవీ మహేంద్ర దొరసాని ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. రెండో సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొనేందుకు విభిన్నమైన కంటెంట్‌తో రెడీ అవుతున్నారనే విషయం టీజర్ ద్వారా స్పష్టమైంది.
నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మానిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తెన్న, సంతోష్ బాలకృష్ణ తదితరులు
దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర
నిర్మాత: పాయల్ సరాఫ్
కథ: సూర్య తేజ ఏలే
స్క్రీన్ ప్లే: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర
మ్యూజిక్: వివేక్ సాగర్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ఆర్ట్: సురేష్ భీమగని
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ శేఖర్


Click it and Unblock the Notifications











