twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీటీడీకి నిర్మాత వీ ఆనందప్రసాద్ భారీ విరాళం.. భవ్య క్రియేషన్స్ అధినేత ఎంత ఇచ్చారంటే!

    |

    టాలీవుడ్‌లో సౌమ్యుడు, వివాదాస్పద అంశాలకు అత్యంత దూరంగా ఉండే నిర్మాతల్లో నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సినిమా నిర్మాణానికి కమిట్ అయ్యాడంటే యూనిట్‌లో నిర్మాతగా ఎలాంటి జోక్యం చేసుకోరనే మంచి పేరుంది. ఇక తాను రూపొందించే సినిమాలు కూడా విలువలు, నైతికతను పాటిస్తూ ఉంటారు.
    ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వీ ఆనందప్రసాద్ ఫ్యామిలీ ప్రధానంగా సాగే సినిమాలు నిర్మిస్తారనే పేరు కూడా ఉంది. సిమెంట్, ఇతర వ్యాపారాలతోపాటు నిత్యం తలమునలై ఉంటూ నిర్మాతగా రాణిస్తూనే సమాజ, దైవ చింతనలో భాగం అవుతుంటారు. తాజాగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ విరాళం ఇవ్వడం ఆయన అధ్యాత్మికత భావనకు అద్దం పట్టింది.

    టీటీడీ ఆధ్వర్యంలోని కొనసాగుతున్న నిత్యాన్నదానానికి వీ ఆనందప్రసాద్ రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. జూలై 7 తేదీ (బుధవారం) తిరుమలలో అడిషనల్ ఈవో శ్రీ ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు.

     Bhavya Creations Chief V Ananda Prasad donates huge amount to TTD

    టీటీడీకి గతంలోనూ ఆనందప్రసాద్ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. ఆనంద ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో ఏడుకొండల వెంకటేశ్వరస్వామి దేవాలయలు కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.

    ఇక సినీ నిర్మాణం విషయానికి వస్తే.. లాక్‌డౌన్ సమయంలో ఓ పిట్ట కథ, మిడిల్ క్లాస్ మెలోడిస్ లాంటి చిత్రాలను విడుదల చేసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకొన్నారు. లాక్‌డౌన్ తర్వాత నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్‌తో కలిసి చెక్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

    English summary
    Bhavya Creations Chief, Producer V Ananda Prasad donates huge amount to TTD. He donates Rs. 1 crore to trust for daily Free meals to devotees. Even Earlier, Ananda Prasad donates 1 crores for Birds trust.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X