అఫీషియల్: సెన్సేషనల్ హీరోతో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ మూవీ

'ఆర్ఎక్స్ 100' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. అతడి తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో అనుకున్న ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. అజయ్ భూపతి తన రెండో సినిమా రవితేజతో చేయబోతున్నాడని, దానికి 'మహాసముద్రం' అనే టైటిల్ పెట్టినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీన్ని నాగ చైతన్యతో చేయబోతున్నారనే రూమర్స్ సైతం వినిపించాయి. ఈ దర్శకుడు ఇపుడు తన తన 2వ ప్రాజెక్టును పక్కన పెట్టేసి 3వ ప్రాజెక్టుకు సిద్ధమయ్యాడు.

అజయ్ భూపతి దర్శకత్వం వహించబోయే 3వ సినిమాను తాము నిర్మించబోతున్నట్లు భవ్యక్రియేషన్స్ వారు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు. ఆర్ఎక్స్ 100 దర్శకుడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది, అతడి 3వ సినిమాను మేము నిర్మించబోతున్నామని తెలిపారు.

Bhavya Creations next film with RX 100 Director Ajay Bhupathi

ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో నటించబోతున్నట్లు భవ్య క్రియేషన్స్ వారు ప్రకటించారు. ఆల్రెడీ అతడి నుంచి అంగీకారం వచ్చిందని, ప్రాజెక్టుకు ఆయన సైన్ చేయడగానే అతడి పేరు అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఆ హీరో ఎవరు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా మేకింగ్‌లో తన విభిన్నతను చాటుకున్న అజయ్.... భవ్య క్రియేషన్స్ లాంటి సంస్థ సపోర్ట్ లభించడంతో ఈ సినిమాను మరింత లావిష్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సంస్థ నుంచి చివరగా వచ్చిన చిత్రం బాలయ్య-పూరి కాంబినేషన్లో వచ్చిన 'పైసా వసూల్'.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X