నితిన్ సినిమాపై రూమర్లు.. ఖండించిన భవ్య క్రియేషన్స్
యువ హీరో నితిన్, ప్రియావారియర్, రకుల్ ప్రీత్ కాంబినేషన్‌లో క్రేజీ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఆ తర్వాత షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకొంటున్నది. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్‌పై మీడియాలో రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై సినిమా యూనిట్ సోషల్ మీడియాలో స్పందించింది.
నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో వస్తున్న రూమర్లలో వాస్తవం లేదు. ఆ సినిమా టైటిల్ చదరంగం అనే టైటిల్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంకా సినిమా టైటిల్‌పై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మీడియా వార్తలన్నీ రూమర్లే అని ఓ పోస్టులో పేర్కొన్నారు. నితిన్ సినిమా టైటిల్‌కు సంబంధించిన నవంబర్ చివరివారంలో ప్రకటిస్తాం. అప్పటి వరకు ఎలాంటి టైటిల్‌ను ప్రచారం చేయవద్దు అని యూనిట్ సూచించింది.

చల్ మోహన రంగా, శ్రీనివాస కల్యాణం సినిమాల తర్వాత నితిన్ కొంత గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రాన్ని భవ్యక్రియేషన్స్ రూపొందిస్తున్నది. ఇక ఈ చిత్రమే కాకుండా భీష్మ, రంగ దే, మరో రెండు చిత్రాల్లో నితిన్ నటిస్తూ బిజీగా మారిపోయారు. శమంతకమణి, పైసా వసూల్ చిత్రాల తర్వాత మరో విభిన్నమైన సినిమా కోసం భవ్య క్రియేషన్స్ చంద్రశేఖర్ ఏలేటితో జతకట్టింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











