Bheema Twitter Review క్లైమాక్స్ హైలెట్.. కానీ..! గోపిచంద్‌కు భీమా మూవీ హిట్టేనా?
మాచో హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. యువ హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటించారు. మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. ఈ సినిమా గురించి ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

భీమా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్. సినిమా ముగింపు కేక పెడుతుంది. గోపిచంద్‌కు హిట్ పడిందనే నమ్ముతున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భీమా సినిమా బాగుంది. శివ రాత్రి రోజు విడుదలైన ఈ సినిమా హిట్టు బొమ్మ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గోపిచంద్ నటించిన భీమా సినిమా హిట్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కొరుకొంటున్నారు. ఈ సినిమా కంటెంట్ బాగుంది. ఫర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమా. బ్లాక్ బస్టర్ కావాలని విష్ చేస్తున్నామని ప్రభాస్ అభిమానులు ట్విట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











