Bheemla Naayak first review.. ఉమేర్ సంధూ నీకు దండం పెడుతాం.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్, అగ్ర నటులు సినిమాల్లో భీమ్లా నాయక్ ఒకటంటే ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనావైరస్, ఇతర పరిస్థితుల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్, సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ తన ట్విట్టర్‌లో భీమ్లా నాయక్ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. అయితే ఉమేర్ అత్యుత్సాహంపై నెటిజన్లు చీల్చి చెండాడారు. ఆ వివరాల్లోకి వెళితే..

భీమ్లా నాయక్ వాయిదాతో
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి రేర్ కాంబినేషన్‌లో వస్తున్న భీమ్లా నాయక్ వాస్తవానికి సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయాలని అధికారికంగా ప్రకటించారు. అయితే RRR సినిమా రిలీజ్ కూడా ఉండటంతో భీమ్లా నాయక్ సినిమాను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేశారు. అయితే భీమ్లా నాయక్ విడుదలను వాయిదా వేయడం వివాదాస్పదం అవ్వడమే కాకుండా పవర్ స్టార్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేయడం తెలిసిందే.

ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1వ తేదీన?
అయితే సంక్రాంతికి విడుదల కాలేకపోయిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఏపీలో ఉన్న పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 25న గానీ, లేదా ఏప్రిల్ 1వ తేదీన గానీ రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ అధికారికంగా అప్‌డేట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ఆర్ఎఫ్‌సీలో పూర్తి చేసి.. ఫస్ట్ కాపీని సిద్దం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఉమేర్ సంధూ రివ్యూ
ఇలాంటి పరిస్థితుల్లో ఉమేర్ సంధూ ట్విట్టర్ ఖాతాలో భీమ్లా నాయక్ సినిమా గురించి తన రివ్యూను ఇచ్చారు. ఆయన ట్వీట్ చేసిన ప్రకారం.. భీమ్లా నాయక్ ఫెంటాస్టిక్. నా మాటలు గుర్తుంచుకోండి. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. అతని స్టార్ డమ్ మరోసారి బ్యాంగ్‌తో వస్తుంది. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్నది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఉమేర్ సంధూ రివ్యూపై నెటిజన్లు
అయితే ఉమేర్ సంధూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేసి ట్రోల్ చేశారు. గత ఐదు నెలల నుంచి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. నీవు సూపర్ అని చెప్పిన సినిమాలు 80 శాతం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నాకు తెలుసు స్టార్‌డమ్‌కు దేవుడు. భీమ్లా నాయక్ తప్పకుండా 250 కోట్లు నికర వసూళ్లను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నమోదు చేస్తుంది అని నెటిజన్ ఝలక్ ఇచ్చాడు.
Recommended Video
నీకు దండం పెడుతా.. రివ్యూలు ఆపేయ్
ఇక ఉమేర్ సంధూను మరో నెటిజన్ ఆటాడుకొన్నాడు. అజాతవాసి సినిమా సూపర్, డూపర్ అంటూ రివ్యూ ఇచ్చింది నువ్వేనా బ్రో అంటూ సెటైర్ వేశాడు. అన్నయ్య దయచేసి సినిమా రివ్యూలు ఇవ్వకు. కావాలంటే మేమందరం నీకు అకౌంట్ పేజ్‌కి ఫాలో కొడుతాం అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందసి్తూ.. ఒరేయ్ నీకు దండం అయ్యా.. నీకు ఏం అర్థం కాదు.. అన్నింటికి ఇలానే చెబుతున్నావు అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఉమేర సంధూ ట్వీట్‌పై ఫ్యాన్స్ గట్టిగా ట్రోల్స్ వేసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











