Bheemla Nayak నుంచి ఊహించని ట్రీట్: ఈ సారి అన్నింటికీ మించిపోయేలా ప్లాన్

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పక్క ఇండస్ట్రీల్లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను తమ తమ భాషల్లోకి రీమేక్‌ చేసుకుంటున్నారు. తెలుగులో కూడా ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో మల్టీస్టారర్ చిత్రాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అప్పటి కంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడం వల్లే ఈ తరహా చిత్రాలు వస్తున్నాయి. ఇలా కొన్ని రోజులుగా మల్టీస్టారర్, రీమేక్ మూవీలు ఎన్నో పట్టాలెక్కేశాయి. అందులో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' కూడా ఒకటి.

విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.

Bheemla Nayak 5th Song on December 20th

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా బ్లాక్‌బస్టర్ అవుతోంది. ఇలా ఇప్పటికే వచ్చిన టీజర్లు, పాటలకు ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. దీంతో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. వీటి వల్ల ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయనే చెప్పాలి. దీంతో దీనికి బిజినెస్ కూడా భారీ మొత్తాల్లో జరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే ట్రీట్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీ నుంచి ఇప్పటి వరకూ నాలుగు పాటలు విడుదలయ్యాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో పాటను కూడా వదలబోతున్నారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి ఐదో పాటు డిసెంబర్ 20న విడుదల కాబోతుందట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఈ పాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాడిందే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సింది.

'భీమ్లా నాయక్' సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X