Bheemla Nayak నుంచి కిక్కిచ్చే న్యూస్: అనుకున్న దాని కంటే ముందేనట

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోలందరూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కథ నచ్చితే ఎలాంటి సాహసాన్నైనా చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. దీంతో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో.. దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. అదే.. 'భీమ్లా నాయక్'.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, కొద్ది రోజుల క్రితమే దీన్ని పున: ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

Bheemla Nayak Movie New Schedule Starts From January 25th

క్రేజీ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, అనివార్య కారణాలతో దీన్ని ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో మరో షెడ్యూల్ మిగిలి ఉండగానే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. దీనికితోడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రష్యా టూర్ వెళ్లడం.. ఆ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడంతో చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గురించి ఓ కిక్కిచ్చే న్యూస్ బయటకు వచ్చింది.

'భీమ్లా నాయక్'కు సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఒకే షెడ్యూల్‌లో మిగిలిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందట. ఇందులో భాగంగానే జనవరి 25వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నారని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అప్పటి నుంచి శరవేగంగా చిత్రీకరణను జరుపుకుని ఫిబ్రవరి మొదటి వారానికే వర్క్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నారట. అంటే అనుకున్న టైం కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ప్రమోషన్‌ను కూడా షురూ చేయబోతున్నారని టాక్.

'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X