Bheemla Nayak ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్.. మళ్ళీ ఎక్కడంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత విడుదలవుతున్న హై వోల్టేజ్ యాక్షన్ సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా అయ్యప్పనుమ్ కొశీయుమ్ కు రీమేక్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా యువ నిర్మాత నాగవంశీ నిర్మించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఈవెంట్ ను వాయిదా వేసుకున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు మరొక కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నారు అని తెలుస్తోంది. మళ్ళీ భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరగబోతోంది అన్న వివరాల్లోకి వెళితే..

 రానాతో కలిసి..

రానాతో కలిసి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ అనంతరం వకీల్ సాబ్ సినిమాతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. కానీ బాక్సాఫీసు వద్ద ఆ సినిమా ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో లాభాలను మాత్రం అందించలేకపోయింది. అయితే ఈసారి పవర్ స్టార్ రానా దగ్గుబాటి తో కలిసి భీమ్లా నాయక్ సినిమాతో భారీ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్

ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్

ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దాదాపు ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 24వ తేదీన ప్రదర్శించబోతున్నారు. అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 300K డాలర్లు అందుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆ కారణంగా క్యాన్సిల్..

ఆ కారణంగా క్యాన్సిల్..

భీమ్లా నాయక్ సినిమా పై అంచనాలు మామూలుగా లేవు అని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫిబ్రవరి 21వ తేదీన సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా వేడుకను నిర్వహించాలని అనుకున్నారు కానీ హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణించడంతో రద్దు చేసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పడంతో చిత్రయూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు.

 ఈవెంట్ కోసం న్యూ డేట్

ఈవెంట్ కోసం న్యూ డేట్

ఇక మళ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎలా నిర్వహిస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు మళ్ళీ నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి అనుమానాలు లేకుండా భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సభ్యులు బుధవారం రోజు అంటే ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

Recommended Video

Bheemla Nayak Pre Release : KTR For Pawan Kalyan's Event | Filmibeat Telugu
 ప్రత్యేక అతిధులుగా..

ప్రత్యేక అతిధులుగా..

భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ డేట్ మారడంతో మళ్లీ అదే సమయానికి వస్తారా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేక అతిథిగా ఇన్వైట్ చేశారు. ఇక ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ఇలాంటి ఏ విషయాలపై మాట్లాడుతాడు అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X