Bheemla Nayak: థియేటర్లో స్క్రీన్ ముందు ఎగరకుండా ఓనర్స్ ప్లాన్.. ఇక డ్యాన్స్ చేయడం ఎవరి తరం కాదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రాణా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల కోసం గత ఏడాది నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ తోనే ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి రోజు సినిమా చూసే అభిమానులు థియేటర్స్ లో స్క్రీన్ ముందు డ్యాన్స్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. అయితే ఒక థియేటర్ లో ఓనర్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఎవరు అలా డాన్స్ చేయకుండా డేంజరస్ ప్లాన్ వేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bheemla Nayak: Pawan Kalyan కోసం ఫ్యాన్స్ హంగామా| Bheemla Nayak Review
ఆయన వల్లే భారీగా అంచనాలు

ఆయన వల్లే భారీగా అంచనాలు


సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడు. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా ఆయన అందించడంతో ఈ సినిమాపై ఒక్కసారి అంచనాలు పెరిగిపోయాయి.

 హైదరాబాద్ లోనే 6కోట్లు

హైదరాబాద్ లోనే 6కోట్లు

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈసారి పవర్ స్టార్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో దాదాపు ఆరు కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్ షోలు

ఫ్యాన్స్ షోలు


ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎప్పటిలానే పవన్ సినిమాపై ఆంక్షలు, టికెట్ల రేట్లు తక్కువగా కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం సినిమా ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు ఫ్యాన్ షోలతో సందడి చేయబోతోంది. శుక్రవారం రోజు ఉదయమే హైదరాబాద్ లో పలుచోట్ల స్పెషల్ షోలతో భీమ్లా నాయక్ సందడి మొదలు కానుంది. తప్పకుండా సినిమా అభిమానులకు మంచి జోష్ ఇస్తుందని కూడా చిత్ర యూనిట్ సభ్యులు పాజిటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.

స్క్రీన్ ముందు ఎగరకుండా..

స్క్రీన్ ముందు ఎగరకుండా..


సాధారణంగా మాస్ ఏరియాలలో అగ్ర హీరోల అభిమానులు స్క్రీన్ ముందు వచ్చి డ్యాన్స్ వేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి భీమ్లా నాయక్ సినిమాలో పాటలు వస్తే అదే తరహాలో స్టెప్పులు వేస్తారు అని చెప్పవచ్చు. కానీ ఒక థియేటర్ ఓనర్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా స్క్రీన్ ముందుకు డ్యాన్స్ చేయకుండా ఉండాలని చాలా కఠినంగా ఆలోచించారు. అలా చేస్తే మిగతా ప్రేక్షకులు ఇబ్బంది పడడమే కాకుండా వెండితెర కూడా డ్యామేజ్ అవుతోందని కొందరు కఠినంగా ఆలోచిస్తున్నారు.

 మేకులు దించి..

మేకులు దించి..

స్క్రీన్ ముందు ఎవరు ఎగరకుండా మేకులు దించి ఉంచారు. దీంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. ఈ ఫోటో పై చాలా రకాల మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు డాన్స్ చేయడం ఎవరి వల్ల కాదు అని నెటిజన్లు కూడా సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో చాలా మంది థియేటర్లలో ఎస్ ఐడియాను ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X