అందరి ఫోకస్ భీమ్లా నాయక్ పైనే.. ప్రీ రిలీజ్ తరువాత పూర్తి చేయాల్సిన టార్గెట్లు ఇవే!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ఒక బిగ్గెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లోకి రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పై కూడా అందరి ఫోకస్ పడింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ఏ స్థాయి లో రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ కొన్ని టార్గెట్లను కూడా పూర్తి చేయాల్సి ఉంది ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

ఇప్పటికే పాటలతో..
మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ పై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన పాటలు కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ప్రస్తుతం అందరూ ట్రైలర్ కోసమే ఎదురుచూస్తున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు.

గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈనెల 21వ తేదీన హైదరాబాద్ లోనే యూసుఫ్ గుడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు అంతేకాకుండా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు అఫీషియల్ గా తెలియజేశారు.

ట్రైలర్ కోసం వెయిటింగ్..
ఇక ఈ పెళ్లి వేడుకలో సినిమాకు సంబందించిన ట్రైలర్ ను కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా ఆ సినిమా ట్రైలర్ పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇక ట్రైలర్ కూడా విడుదల అయితే అంతకు మించి అనేలా అంచనాలు పెరుగుతాయి అని చెప్పవచ్చు.

రాధేశ్యామ్ రికార్డ్..
అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయితే పాత రికార్డులను బ్రేక్ చేసే విధంగా వైరల్ అవుతుందా లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఎలాంటి టార్గెట్ల పై ఫోకస్ చేసింది అని వివరాల్లోకి వెళితే.. వ్యూస్ పరంగా ప్రభాస్ రాధే శ్యామ్ ట్రైలర్ 24 గంటలలో 23.20 మిలియన్ లైక్స్ ని అందుకుంది. మొదట ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

RRR రికార్డ్ కూడా..
ఇక లైక్స్ విషయంలో RRR సినిమా 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ అందుకుంది. అయితే భీమ్లా నాయక్ ఈ రెండు రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో అనేది హాట్ టాపిక్ గా మారింది. 2 నిమిషాలకు 30 సెకన్ల వ్యవవధిలో ఉండే ఆ ట్రైలర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హై వోల్టేజ్ సన్నివేశాలతో పాటు త్రివిక్రమ్ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











