భీమ్లా నాయక్ పాటకు పవన్ కళ్యాణ్ స్టెప్పులేస్తే... త్వరలోనే మరో గుడ్ న్యూస్ .. స్టిల్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొట్టమొదటి హై వోల్టేజ్ మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కు జోడిగా నిత్యా మీనన్ నగిస్తుండగా రానా పాత్రకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్న తెలిసిందే. ఇక సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సీతారా ఎంటర్టైన్మెంట్లో నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు ఇటీవల ఫినిష్ అయ్యాయి. చివరి పాటను కూడా షూట్ చేయడం జరిగింది.

సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడమే కాకుండా అన్ని పనులు దగ్గరుండి చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు కూడా సోషల్ మీడియాలో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని అభిమానుల్లో కూడా ఒక బలమైన నమ్మకం అయితే ఏర్పడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి వీడియో సాంగ్ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్ గా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు.

 Bheemla nayak new poster viral and another special surprise soon

సినిమా లోని మొదటి పాట టైటిల్ సాంగ్ భీమ్ భీమ్ భీమ్లా నాయక్ అనే పాటకు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయబోతున్నట్లు సమాచారం ఈ టైటిల్ సాంగ్ మొదట్లోనే మంచి ప్రశంసలు అందుకుంది. ఇక వీలైనంత త్వరగా ఒక వీడియో సాంగ్ ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాపై ఎప్పటికప్పుడు పాజిటివ్ గా బజ్ పెరిగే విధంగా నిర్మాత నాగ వంశీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాదాపు సినిమాకు అవసరమయ్యే అప్ డేట్స్ అన్ని కూడా ఇచ్చేశారు.

ఒక విధంగా సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇక ఆ తర్వాత ప్రమోషన్ ద్వారా అంచనాల స్థాయి మరింత పెరిగింది. ఈ సినిమాను మొదట సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ అప్పుడు మిగతా సినిమాల నుంచి పోటీ ఎక్కువగా ఉండడం అలాగే కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉండడం వలన వాయిదా పడక తప్పలేదు. కానీ ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయంలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఫిబ్రవరి 25 లేదా మార్చిలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మొన్నటి వరకు ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు వంద కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X