twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    bheemla nayak: హిందీలో పవన్ కళ్యాణ్ కు డబ్బింగ్ చెప్పింది ఇతనే.. మోస్ట్ టాలెంటెట్ యాక్టర్

    |

    భీమ్లా నాయక్ మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో మంచి బూస్ట్ అయితే ఇచ్చేసింది. ఓవరాల్ గా సినిమా నిర్మాతలకు అయితే మంచి ప్రాఫిట్స్ అందించింది గాని ఇంకా కొన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ టార్గెట్ ను పూర్తి చేయలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వీకెండ్ అనంతరం కాస్త నెమ్మదించింది అనుకున్న సమయానికి సడన్ గా శివరాత్రికి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయి. ఇక ఈ సమయంలోనే హిందీలో కూడా సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక హిందీ ట్రైలర్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు హింది డబ్బింగ్ ఎవరు చెబుతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    సాలీడ్ ఓపెనింగ్స్

    సాలీడ్ ఓపెనింగ్స్

    మలయాళం ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ లోనే 50కోట్ల షేర్ వసూళ్లను సాధించడం విశేషం. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధికంగా సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.

     ప్లస్ పాయింట్..

    ప్లస్ పాయింట్..

    సినిమాలో రానా దగ్గుబాటి మరొక ముఖ్యమైన పాత్రలో నటించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. వీరి ఇద్దరి పాత్రలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైలాగ్స్ కూడా సినిమాకు కరెక్ట్ గా సెట్టయ్యాయి. ఇక యువ దర్శకుడు సాగర్ కె చంద్ర సినిమాను తనదైన శైలిలో ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందించేలా చేశారు.

    ఆ సెంటిమెంట్ తో..

    ఆ సెంటిమెంట్ తో..

    ఇక హిందీలో భీమ్లా నాయక్ సినిమాను అప్పుడే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యంగా విడుదల చేయాల్సి వస్తోంది. హిందీలో పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే సెంటిమెంటుతో భీమ్లాను కూడా విడుదల చేస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం హిందిలో ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. కానీ భీమ్లా పై బయ్యర్లు మంచి నమ్మకంతో అయితే ఉన్నారు.

    హిందీ డబ్బింగ్ చెప్పింది ఎవరు?

    హిందీ డబ్బింగ్ చెప్పింది ఎవరు?

    ఇక భీమ్లా నాయక్ సినిమాను త్వరలో హిందీలో చేయనున్న చిత్ర యూనిట్ హిందీ ట్రైలర్ ను నిన్ననే విడుదల చేసింది. ట్రైలర్ నార్త్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక హిందీలో పవన్ కళ్యాణ్ కు డబ్బింగ్ చెప్పింది ఎవరు అనే విషయంలో ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

     అతను ఎవరంటే?

    అతను ఎవరంటే?

    పవన్ అభిమానులు హిందీలో తమ స్టార్ హీరో వాయిస్‌కి ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో బజ్ చూస్తేనే అర్ధమవుతుంది.పవన్ భీమ్లా పాత్రకు హిందీలో వాయిస్ ఓవర్ ఇచ్చింది హిందీ టీవీ నటుడు గౌరవ్ చోప్రా. గౌరవ్ హిందీ టెలివిజన్ రంగంలో మంచి నటుడిగా కూడా గుర్తింపు అందుకున్నాడు. ఇక అతను గతంలో చాలామంది సౌత్ ఆర్టిస్టులకు హిందీలో డబ్బింగ్ చెప్పాడు. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ లో హిందీలో పవన్ కళ్యాణ్ కు పవర్ఫుల్ గా వాయిస్ అందించాడు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    Bheemla nayak pawan kalyan voice over behind the details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X