Official: సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకున్న భీమ్లా నాయ‌క్‌.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా లో రానా దగ్గుబాటి మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్స్ కూడా అభిమానుల్లో అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదు అని నిర్మాతలు అధికారికంగా ప్రకటన ఇచ్చేశారు. అలాగే మరో కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.

Recommended Video

Bheemla Nayak New Release Date Announced | Pawan Kalyan| Rana Daggubati
మరోసారి వాయిదా తప్పట్లేదు

మరోసారి వాయిదా తప్పట్లేదు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద సినిమాలు విడుదలయ్యే వరకు కూడా నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పెద్ద సినిమాలు ఊహించని విధంగా వాయిదా పడుతున్నాయి. ఇక మరొకసారి భీమ్లా నాయక్ సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. ఇప్పటికే రెండుసార్లు కొత్త రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసిన నిర్మాతలు ఇప్పుడు మరొకసారి వాయిదా వేయక తప్పలేదు.

పవర్ఫుల్ మూవీ..

పవర్ఫుల్ మూవీ..

హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. యువనిర్మాత నాగవంశి నిర్మిస్తున్న ఈ సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రాణా దగ్గుబాటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

నిర్మాతల చర్చలతో..

నిర్మాతల చర్చలతో..

రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. తప్పకుండా సంక్రాంతి బరిలో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అని అందరిలో ఒక నమ్మకం అయితే ఉంది. ఇక పవర్ స్టార్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ సంక్రాంతి సీజన్లో పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భీమ్లా నాయక్ సినిమా తప్పుకోవాలని మిగతా చిత్ర నిర్మాతలు కోరారు. దీంతో జరిగిన చర్చలో భాగంగా సినిమా వాయిదా పడక తప్పలేదు.

పోటీ మంచిది కాదని..

పోటీ మంచిది కాదని..

దిల్ రాజు డి.వి.వి.దానయ్య అలాగే మరికొంతమంది నిర్మాతల సమక్షంలో ఇటీవల ఒక మీటింగ్ జరిగింది. పోటీలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా జనవరి 14 వ తేదీన వస్తుండగా ఇక అందరి కంటే ముందుగా సంక్రాంతి బరిలో RRR సినిమా జనవరి 7వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ రెండు పాన్ సినిమాలు కాబట్టి పోటీ తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మిగతా సినిమాల కలెక్షన్స్ పై గట్టిగానే ప్రభావం పడుతుంది. అందువల్లే ఈ పోటీ ఇండస్ట్రీకి ఏ మాత్రం మంచిది కాదు అని చిత్ర నిర్మాతలు చర్చించారు.

భీమ్లా నాయక్ న్యూ రిలీజ్ డేట్..

భీమ్లా నాయక్ న్యూ రిలీజ్ డేట్..

ఇక ఇటీవల ప్రొడ్యూస‌ర్ గిల్డ్ నిర్ణ‌యంతో.. భీమ్లా నాయక్ సినిమాని వాయిదా వేశారు. ఇక ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ సినిమాను తప్పకుండా విడుదల చేస్తామని నిర్మాతలు తెలియజేశారు. ఇక భీమ్లా నాయక్ సినిమా తప్పుకోవడంతో ఈ సంక్రాంతికి ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్ మ‌ధ్యే పోటీ కొనసాగనుంది. ఇక బంగార్రాజు జనవరి 15వ తేదీన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఆ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X