పవన్ కల్యాణ్ దేవుడితో పనిచేసే భాగ్యం.. పై దేవుడికి ధన్యవాదాలు.. గణేష్ మాస్టర్ ఎమోషనల్

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. వేదిక మీద మాట్లాడటానికి ముందు వేదికపై యాంకర్ సుమ కోరిక మేరకు భీమ్లానాయక్ పాటకు స్టెప్పులేసి అభిమానులను ఆకట్టుకొన్నాడు. ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ మాట్లాడుతూ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాకు ఎప్పుడూ మంచి సాంగ్స్ ఇస్తూ ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్, నాగవంశీ, దర్శకుడు సాగర్ కే చంద్రకు ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌తో ఎన్నో ఏళ్లుగా పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాకు మళ్లీ సాంగ్స్ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చారు. పవన్ సార్‌తో పనిచేయడం ఓ అద్భుతం. ఓ అదృష్టం. కొన్ని సంవత్సరాలుగా నాకు పనిచేసే అదృష్టం దక్కింది. ఈ దేవుడి వద్ద పనిచేసే అవకాశం కల్పించిన ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్ సార్‌కు ఓ వేసుకొండి. తమన్ సార్ కొత్తగా పాటలు ఇచ్చారు. మాకు కొత్తగా డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసే అవకాశం లభించింది. పవన్ కల్యాణ్‌కు ఇందుకు మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అన్నారు.

Bheemla Nayak pre release event: Ganesh master emotional Speech

ఈ వేడుకలో పద్మశ్రీ పదిమెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్యకు నిర్మాత నాగవంశీ సన్మానం చేశారు. అనంతరం వేదికపై ఆడ కాదు.. ఇడ కాదు.. అంటూ మొగిలయ్య పాట పాడారు. ఈ సినిమా పాట పడే అవకాశం ఇచ్చినందుకు తమన్‌కు ధన్యవాదాలు. నాకు తమన్ సార్ రెండుసార్లు సన్మానం చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది అని మొగిలయ్య అన్నారు.

ఈ వేడుకలో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. భాషా ప్రియులు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్.. మొగిలయ్యను గుర్తించి ఆయనతో పాట పాడించారు. కేవలం పాట పాడించడమే కాకుండా అంతరించి పోతున్న జానపద కళకు ప్రాణం పోశారు. ఈ సినిమాలో మూడు పాటలు పాడించారు. నేను కేవలం మూడు రోజుల్లోనే మూడు పాటలు రాశాను. అంత తొందరగా రాసినందుకు నాకే ఆశ్చర్యం వేసింది. 25వ తేదీన భూమి బద్దలు అవుతుంది. అంచనాలు క్రియేట్ చేసేది అభిమానులే.. వాటిని అధిగమించేది వారే అని రామజోగయ్య శాస్త్రి అన్నారు.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. చిత్ర యూనిట్‌తోపాటు పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X