Bheemla Nayak pre release event live: పవన్ కల్యాణ్, కేటీఆర్ పవర్‌పుల్ ఎంట్రీ.. ఒకేసారి అడుగుపెట్టడంతో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కన్నులపండువగా జరిగింది. ప్రధాన వక్తల ప్రసంగాలకు ముందు పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లోని పాటలకు కొరియోగ్రాఫర్లు డ్యాన్సులు చేసి వేదికను హోరెత్తించారు. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా రాగా, మంత్రి శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌తోపాటు రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్, సప్తగిరి, దర్శకుడు సాగర్ కే చంద్ర, ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు.

ఈ వేడుక కోసం పవన్ కల్యాణ్, కేటీఆర్, రానా దగ్గుబాటి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్, పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి రావడంతో అభిమానులు పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. అయితే కార్యక్రమాలు జరుగుతున్నంత సేపు కేటీఆర్, పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడుకొంటూ కనిపించారు. ఏదో విషయం మీద సీరియస్‌గా మాట్లాడం అందరిని ఆకర్షించింది.

 Bheemla Nayak pre release event: Pawan Kalyan, KTR grand entry make fans happy

పవన్ కల్యాణ్, కేటీఆర్ వేదికపైకి రావడంతో భీమ్లా నాయక్ సినిమా కోసం కాసర్ల శ్యామ్ రాసిన ఓ భావోద్వేగమైన పాటను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ ఈ సినిమా పాటల కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొన్నారు అని తమన్ చెప్పారు. కాసర్ల శ్యామ్ రాసిన పాటను లైవ్ ఆర్కెస్ట్రాతో పాడిస్తూ రిలీజ్ చేశారు.

దుమ్ము దుమ్ము అంటూ రొమ్ము రొమ్ము చీల్చిన అనే పాటను వేదిక మీద డైరెక్ట్‌గా రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X