twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తగ్గేదేలేదంటున్న 'భీమ్లా నాయక్'.. ఈసారి కూడా మిస్ అవ్వదు అంటూ ఆసక్తికర ట్వీట్!

    |

    వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా మీద అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా వెనక్కు తగ్గేది లేదు అన్నట్టు కామెంట్లు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    నేటివిటీకి తగ్గట్టు

    నేటివిటీకి తగ్గట్టు


    మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా అక్కడ బిజు మీనన్ పోషించిన పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. సినిమా యధాప్రకారం కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసారు.

     పవన్ ఎంట్రీ

    పవన్ ఎంట్రీ

    ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సింహభాగం పూర్తవడంతో కొంతమేర షూటింగ్ చేయాల్సి ఉంది. మలయాళంలో ఈ సినిమా చూసిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా హక్కులను ఆ వెంటనే కొనేశారు. సినిమా కొన్నప్పటి నుంచి ఈ సినిమాలో రానా పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంది కాకపోతే పోలీస్ అధికారి పాత్ర విషయంలో అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ చివరికి పవన్ ఎంట్రీ ఇచ్చాడు.

    జనవరి 12వ తేదీ

    జనవరి 12వ తేదీ

    ఈ సినిమాలో దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంటే పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు.. రఘుబాబు, బ్రహ్మాజీ, రవీంద్ర విజయ్, వండర్ ఉమెన్ లిరీషా వంటి వారు నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీ 2022 వ సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు.

    త్రివిక్రమ్ కథ, కథనం

    త్రివిక్రమ్ కథ, కథనం

    సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ, కథనం మాటలు అందిస్తున్నారు.. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా క్లైమాక్స్ ఫైట్ లో పవన్ ఇంటెన్స్ లుక్ ఒక దానిని ఆయన షేర్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ సారి కూడా మిస్ అవ్వదు అని ఆయన పేర్కొన్నారు.

    జనవరి 7 'ఆర్ ఆర్ ఆర్

    జనవరి 7 'ఆర్ ఆర్ ఆర్

    నిజానికి 13వ తేదీన 'సర్కారు వారు పాట' .. 14వ తేదీన 'రాధే శ్యామ్' సినిమాలు లైన్ లోకి వచ్చాయి. బహుశా ఈ స్థాయి స్టార్స్ మధ్య ఇంతవరకు ఇలాంటి పోటీ జరగలేదని అంతా అనుకున్నారు.ఈ నేపథ్యంలోనే 'ఆర్ ఆర్ ఆర్' జనవరి 7వ తేదీన థియేటర్లకు వస్తున్నట్టు ప్రకటించారు.

    Recommended Video

    Latest Tollywood Updates : ఆ రికార్డుల కోసం బాబాయ్, అబ్బాయ్ రెడీ! || Filmibeat Telugu
    మేకర్స్ క్లారిటీ

    మేకర్స్ క్లారిటీ

    దీంతో 'సర్కారు వారి పాట' ఏప్రిల్ 1వ తేదీకి వెళ్ళిపోయింది. పవన్ సినిమా కూడా బరిలో నుంచి తప్పుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో తమ సినిమాను ముందుగా చెప్పినట్టుగానే జనవరి 12వ తేదీనే వస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే 'భీమ్లా నాయక్' విడుదలను కాస్త వెనక్కి జరపడానికి కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

    English summary
    Bheemla Nayak Producer gave clarity on release date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X