ఇంత అందమైన హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే నేనే.. భీమ్లా నాయక్ నిర్మాత
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో కొంత మంది నిర్మాతలు చాలా భిన్నంగా సినిమాలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఇక ప్రస్తుతం సితార ఎంటర్టైన్ మెంట్స్ నాగ వంశీ కూడా గ్యాప్ లేకుండా డిఫరెంట్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ లో నిర్మాత నాగ వంశీ మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. భీమ్లా నాయక్ వంటి సినిమాను నిర్మించిన నాగ వంశీ ఒక్కసారిగా తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందమైన హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే ఎందుకు మిస్ చేసుకుంటాను అని అనడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎక్కువగా త్రివిక్రమ్ తో..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వరుసగా బాక్సాఫీస్ హిట్ సినిమాలను నిర్మించిన సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్స్. ఆ సంస్థ అధినేత చిన బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వరుసగా సినిమాలను రూపొందిస్తున్నారు. ఇక చిన బాబు కుమారుడు నాగ వంశీ కూడా సితార ఎంటర్టైన్ మెంట్స్ లో మొన్నటి వరకు ఎక్కువగా చిన్న సినిమాలను నిర్మించారు. ఇక త్వరలోనే భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

చిన్న సినిమాలు..
చిన బాబు తనయుడు నాగ వంశీ ఇటీవల కాలంలో ఎక్కువగా చిన్న సినిమాలను చాలా బాగా నిర్మిస్తున్నట్లుగా మంచి గుర్తింపు అందుకుంటున్నాడు. ఎక్కువగా కొత్త దర్శకులకు నటీనటులకు మంచి అవకాశాలను అందించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రొడక్షన్ లో జెర్సీ భీష్మ వంటి మంచి సినిమాలు కూడా తెరపైకి వచ్చాయి.

డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ తరువాత
ఇక త్వరలోనే డీజే టిల్లు వంటి సినిమాలు కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు ఆలోచిస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమా ప్రమోషన్లో చిత్ర నిర్మాత నాగ వంశీ మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాదారణంగా నాగ వంశీ సినిమా సినిమాల ఈవెంట్స్ లో కూడా పెద్దగా మాట్లాడడు అని బయట అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన మొదటి సారి సినిమా ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన విధానం ఒక్కసారిగా షాక్ జూ గురై ఎలా చేసింది.

హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే ఛాన్స్..
డిజే టిల్లు సినిమా మీ బయోపిక్ అనుకోవచ్చా అని ఒక విలేకరి అడగడంతో.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దుపెట్టుకునే అవకాశం వస్తే నేనే యాక్ట్ చేస్తాను అంటూ దిమ్మతిరిగెలా ఆన్సర్ ఇచ్చారు. ఇక భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని మరికొందరు అడగడంతో మంచి దర్శకుడిని ఉంటే చూడండి అని కూడా సమాధానం ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.
Recommended Video

వైఎస్ జగన్ పై కామెంట్
డీజే టిల్లు సినిమా బోల్డ్ రొమాంటిక్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక అలాంటి సినిమా ప్రభావమో ఏమో గాని నాగవంశీ చాలా బోల్డ్ గా మాట్లాడేందుకు ప్రయత్నం చేశాడు. ఇక భీమ్లా నాయక్ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్నకు.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడు 50% ఆక్యుపెన్సీ తీసేస్తే అప్పుడే విడుదల చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications










