Bheemla Nayak నుంచి సాంగ్ లీక్.. ఆ లీక్ మరువక ముందే సోషల్ మీడియాలో హల్చల్!
తెలుగు సినీ పరిశ్రమకు లీకేజీల టెన్షన్ వెంటాడుతోంది. ఫిబ్రవరి 14వ తేదీన అంగరంగ వైభవంగా విడుదల చేద్దామని సర్కారు వారి పాట మేకర్స్ సాంగ్ రెడీ చేసుకున్న రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో లీక్ చేసిన ఘటన మరువక ముందే ఇప్పుడు భీమ్లా నాయక్ షూటింగ్ కి సంబంధించిన ఒక చిన్న లీక్ కావడం సంచలనంగా మారింది. అ వివరాల్లోకి వెళితే

మలయాళంలో సూపర్ హిట్
వకీల్ సాబ్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రానా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండగా రానా మాజీ మిలిటరీ అధికారి పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

షూటింగ్ వీడియో లీక్
ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలు విడుదలయ్యాయి. ఆ విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ వీడియో లీక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

పవన్ కళ్యాణ్ డ్యాన్స్ స్టెప్
కళావతి సాంగ్ లీక్ కావడంతో మహేష్ బాబు సర్కార్ వారి పాట టీమ్ కు షాక్ తగిలింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టీమ్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. సినిమాకు సంబందించిన ఓ డ్యాన్స్ క్లిప్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొరియోగ్రాఫర్ శిక్షణ ఇచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ డ్యాన్స్ స్టెప్ వేస్తున్నట్లు లీక్ అయిన చిన్న క్లిప్ లో కనిపిస్తోంది. ఇక ఆ పాట షూట్ చేస్తున్న లొకేషన్, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లు మరియు భారీ సెట్‌ని కూడా చూడవచ్చు. ఇలాంటి లీక్‌లు ఖచ్చితంగా సినిమా మీద ఉన్న అంచనాల విషయంలో అభిమానులను ఇబ్బంది పెడతాయని చెప్పక తప్పదు.

ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ త్వరలో లోడ్ అవుతుందని నిర్మాత నాగ వంశీ ట్విట్టర్‌లో పంచుకున్న తరువాత ఈ లీక్ బయటకు వచ్చింది. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1, 2022న విడుదల కానుంది. ఇటీవల టాలీవుడ్ నటీనటులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన సమావేశ సానుకూల ఫలితాన్ని బట్టి, సినిమా విడుదల తేదీపై సందిగ్ధత త్వరలో క్లియర్ అవుతుందని భావిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే
మరోవైపు, పవన్ దర్శకుడు క్రిష్‌తో కలిసి హరి హర వీర మల్లు సినిమా చేస్పతున్నినారు. ఈ సినిమా ఏప్రిల్ 29,2022 న థియేటర్లలోకి రానుంది. అలాగే ఆయన హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో కూడా కలిసి పని చేయనున్నారు. అలాగే బండ్ల గణేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











