Pawan Kalyan కు అలాంటి డేంజర్.. సన్నిహితులే మోసం.. భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రాంగోపాల్ వర్మ ట్రోలింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఫ్యాన్స్‌లో జోష్ రేకెత్తించేందుకు ప్లాన్ ప్రకారమే భీమ్లా నాయక్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అభిమానులు ఆదరణ భారీగా లభించింది. అయితే ఈ ట్రైలర్‌ను చూసిన రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్టుగా లేదనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆర్జీవి తన ట్విట్టర్‌లో వరుసగా చేసిన ట్వీట్లు ఏమిటంటే..
Recommended Video

భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డుల మోత
భీమ్లా నాయక్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కాగానే వెంటనే రికార్డుల మోత మోగించింది. అయితే మెజారిటీ నెటిజన్లు సంతృప్తిని వ్యక్తం చేయగా.. రాంగోపాల్ వర్మ ట్రైలర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ భీమ్లా నాయక్ ట్రైలర్ గురించి వరుసగా ట్వీట్ చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.

డేనియల్ శంకర్ అని టైటిల్ పెట్టాల్సింది
భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. రానా దగ్గుబాటిని ప్రమోట్ చేయడానికి పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను నిర్మాత, దర్శకులు దెబ్బ తీశారనిపించింది. ఒక పవన్ కల్యాణ్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను టైటిల్‌ను భీమ్లా నాయక్ కాకుండా డేనియల్ శంకర్ అని పెట్టాల్సిందనే అభిప్రాయం కలిగింది అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రైలర్ పవన్ కల్యాణ్‌ది.. సినిమా రానాది అంటూ
భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత అన్ని విషయాలను, అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత జరిగిన అన్యాయంపై నిజాయితీగా అభిప్రాయం చెప్పాలనుకొంటున్నాను. భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే.. కేవలం ట్రైలర్ మాత్రమే పవన్ కల్యాణ్‌ది. సినిమా మాత్రం రానా దగ్గుబాటిది అని రాంగోపాల్ వర్మ అన్నారు.

పవన్ కల్యాణ్‌కు డేంజర్
ఇక భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే.. బాహుబలి తర్వాత పవన్ కల్యాణ్ కంటే.. రానాకు ఎక్కువ ఉత్తరాదిలో పాపులారిటీ ఉందని స్పష్టమైంది. అయితే రానా హీరోగా చేయడం వల్ల విలన్‌గా చేసిన పవన్ కల్యాణ్‌కు ఆ ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉన్నది. పవన్ కల్యాణ్‌కు అతిసన్నిహితులైన వాళ్లే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకొంటారు అని రాంగోపాల్ వర్మ అనుమానం వ్యక్తం చేశారు.

వేగంగా 1 మిలియన్ లైక్స్
ఇదిలా ఉండగా, భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్నది. అత్యంత వేగంగా 10 లక్షల లైక్స్ సాధించిన ట్రైలర్‌గా భీమ్లా నాయక్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 13 గంటల 30 నిమిషాల్లోనే ఈ ట్రైలర్ మిలియన్ లైక్స్ సొంతం చేసుకొన్నది. RRR ట్రైలర్ 1.24 మిలియన్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. RRR సినిమా ట్రైలర్‌కు దగ్గరగా భీమ్లా నాయక్ చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











