twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డుల ఊచకోత.. RRR, పుష్ప రికార్డులను బ్రేక్ చేస్తూ..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో అలజడి క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం భీమ్లా నాయక్ ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సోమవారం రాత్రి 9 గంటలకు విడుదల చేయగా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేసింది. పుష్ప RRR సినిమాలకు సంబంధించిన రికార్డులను కూడా ఊచకోత కోసింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu
    మంచి విజయాన్ని అందుకోవాలని..

    మంచి విజయాన్ని అందుకోవాలని..

    హారిక హాసిని అనుబంధ సంస్థ యువనిర్మాత నాగవంశీ నిర్మించిన భీమ్లా నాయక్ సినిమాను యువ దర్శకుడు సాగర్ కే చంద్ర చెక్కించాడు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడమే కాకుండా తన అనుభవంతో సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నాడు. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా ఈ సినిమా కోసం సమయాన్ని సమయాన్ని వెచ్చిస్తున్నారు.

    నెగిటివ్ కామెంట్

    నెగిటివ్ కామెంట్

    పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి ఇద్దరు కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను అందుకున్నవారే. అయితే వీరి కలయికపై మొదటినుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక సినిమా ట్రైలర్ లో కూడా ఇద్దరూ పోటాపోటీగా నటించారు అనే చెప్పాలి. ఈ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ క్యారెక్టర్స్ తరహాలో కాకుండా రానా పాత్ర చాలా నెగిటివ్ గా హైలెట్ చేస్తున్నారు అని ఒక కామెంట్ అయితే బలంగా వినిపిస్తోంది.

    ఆ రికార్డులను ఊచకోత

    ఆ రికార్డులను ఊచకోత

    ఇక టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా భీమ్లా నాయక్ ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో పుష్ప అలాగే మరికొన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు యూట్యూబ్ లో రికార్డులను భీమ్లా నాయక్ ఊచకోత కొస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అంతకు మించిన విజయాన్ని అందుకుంటుంది అనేది కూడా ఓ వర్గం వారు గట్టిగా నమ్ముతున్నారు.

    అత్యధిక వేగంగా..

    ఇక భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఇప్పటివరకు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ అత్యదిక వేగంగా 100K లైక్స్ అందుకున్న ట్రైలర్ గా రికార్డును నమోదు చేసింది. అలాగే 200K, 500K, 600K, 700K, 800K లైక్స్ కూడా చాలా వేగంగా అందుకున్న భీమ్లా నాయక్ మిగతా సినిమాల రికార్డును బ్రేక్ చేసింది.

    RRR, పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తూ..

    RRR, పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తూ..

    టాలీవుడ్ లో పుష్ప సినిమా 19గంటల 19 నిమిషాల్లో 800K లైక్స్ అందుకోగా.. వకీల్ సాబ్ 13 గంటల్లో ఆ రికార్డు అందుకుంది. ఇక RRR సినిమా 4 గంటల 12 నిమిషాల్లో ఆ రికార్డును అందుకోగా భీమ్లా నాయక్ మాత్రం కేవలం 1 గంట 56 నిమిషాల్లోనే అత్యధిక లైక్స్ అందుకున్న ట్రైలర్ గా రీకార్డును బ్రేక్ చేసింది. చూస్తుంటే ఈ సినిమా ట్రైలర్ 24గంటల్లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం పక్కా అనిపిస్తోంది.

    English summary
    Bheemla nayak trailer most liked trailer in tollywood trending
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X