Bheemla Nayak: డేనియల్ శేఖర్ రెడీ.. పవన్‌ను ఢీకొట్టేందుకు ఎవరూ ఊహించని విధంగా!

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ జోనర్‌లో ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో చాలా వరకూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో హీరోలు అలాంటి సినిమాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. వారి అభిరుచికి అనుగుణంగానే దర్శక నిర్మాతలు కూడా మల్టీస్టారర్ మూవీలను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా సినిమాలను బడా హీరోలు, చిన్న నటులు పట్టాలెక్కించేశారు కూడా. అందులో బడా స్టార్లు నటిస్తోన్న 'భీమ్లా నాయక్' మూవీ ఒకటి అన్న విషయం తెలిసిందే.

రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి చేస్తున్న చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను కూడా ఇది పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

'భీమ్లా నాయక్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ వీడియోతో పాటు ఓ పాట కూడా విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాత్రకు సంబంధించిన ఈ రెండింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో టాలీవుడ్ హిస్టరీలోనే పలు రికార్డులను కూడా బద్దలు కొట్టేశాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ రాబోతుందని తెలుస్తోంది.

Bheemla Nayak Update: Rana Daggubati Intro Video will Come Out

భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీ నుంచి శుక్రవారం (సెప్టెంబర్ 17) సాయంత్రం 4:30 గంటలకు ఓ అప్‌డేట్ రాబోతుందని తెలుస్తోంది. ఇది ఈ సినిమాలో డేనియల్ శేఖర్ అనే పాత్రను పోషిస్తోన్న దగ్గుబాటి రానాకు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో అని సమాచారాం. 'భీమ్లా నాయక్' ఇంట్రో వీడియో మాదిరిగానే దీన్ని కూడా ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, అందులో పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చినట్లుగానే.. ఈ వీడియోలో రానా అదిరిపోయే మాస్ డైలాగ్‌ను పలకబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

స్వార్థం ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో మలయాళంలో 'అయ్యప్పనుమ్ కోషియం' తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి 'భీమ్లా నాయక్'గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. వీళ్లిద్దరి మధ్య ఆధిపత్యం కోసం జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ మజాను పంచబోతున్నాయని తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X