Bheemla Nayak సడెన్ సర్‌ప్రైజ్.. దీపావళి బొనంజాకు గెట్ రెడీ!
వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా మీద అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా అక్కడ బిజు మీనన్ పోషించిన పాత్రని ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. సినిమా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సింహభాగం పూర్తికాగా ఇంకా కొంతమేర షూటింగ్ చేయాల్సి ఉందని అంటున్నారు.
మలయాళంలో ఈ సినిమా చూసిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా హక్కులను వెంటనే కొనుక్కున్నారు. కొనుక్కున్న నాటి నుంచి ఈ సినిమాలో రానా పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉండేది కాకపోతే పోలీస్ అధికారి పాత్రలో బాలకృష్ణ నటిస్తాడని కొన్నాళ్ళు రవితేజ నటిస్తాడని కొన్నాళ్ళు ఇలా పలువురు హీరోల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ప్రాజెక్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమాలో ఆయన గెటప్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చూపిస్తూ రిలీజ్ చేసిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో బాగా ట్రెండ్ అయింది. ఈ ఒక్క వీడియో సినిమా మీద అంచనాలు భారీగా పెంచేసింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక భీంలా నాయక్ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌లు, రెండు పాటలు, పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ పాత్ర గ్లింప్స్, రానా నటిస్తున్న డేనియల్ శేఖర్ పాత్ర గ్లింప్స్ విడుదల చేయగా వాటన్నింటికీ మంచి స్పందన లభించింది.

పవన్, రానా పాత్రల యాటిట్యూడ్, వీరిద్దరి మధ్య జరిగే ఇగో వార్ వంటి అంశాలు పోటాపోటీగా ఉండబోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామని తాజాగా మేకర్స్ ప్రకటించారు. రేపు అంటే బుధవారం నాడు ఈ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్ బ్లాస్టింగ్ అప్‌డేట్ రెడీ అవుతుంది అని పేర్కొంది తాజాగా యూనిట్. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ఈ అప్‌డేట్ విషయాలను పంచుకోనున్నారట. అయితే ఎలాంటి అప్‌డేట్ ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా నుంచి టీజర్ లేదా రెండు పాత్రలను కలిపేలా ఏదైనా గ్లింప్స్ లాంటిది రాబోతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. ఇక ఈ సినిమాలో దగ్గుబాటి రానా సరసన సంయుక్తా మీనన్ నటిస్తుంటే పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు.. రఘుబాబు, బ్రహ్మాజీ, రవీంద్ర విజయ్, వండర్ ఉమెన్ లిరీషా వంటి వారు నటిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీ 2022 వ సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ, కథనం మాటలు అందిస్తున్నారు.. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











