‘ఆఫర్ల కోసం 8 ఏళ్లు తన్నులు తిన్నా.. ఆ స్టూడియోలో అలాంటి అవమానం’

ఎన్నో ఆశలు, కలలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే యువతీ యువకులకు ఇక్కడ నిలదొక్కుకోవడం అంత తేలిక కాదనే విషయం ఆలస్యంగా అర్ధమవుతుంది. ఇక్కడి పరిస్ధితులు అర్ధమయ్య సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాగని సొంతూరు వెళ్లలేరు.. చావైనా బతుకైనా ఇక్కడేనని చాలీ చాలనీ వేతనాలతో నెట్టుకొచ్చేవారు ఎందరో. అయితే కొందరు మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసి విజేతలుగా నిలుస్తారు. ఈ కోవలోకే వస్తారు ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తున్న భీమ్స్ జీవితం.. వడ్డించిన విస్తరి కాదు. ఈ స్థాయికి రావడానికి ఆయన కష్టాలు పడ్డారు, అవమానాలను ఎదుర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ తన సినిమా కష్టాలను పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన భీమ్స్ తొలుత 2012లో నువ్వానేనా అనే సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కెవ్వుకేక, బెంగాల్ టైగర్, ధమాకా, బలగం, టిల్లూ స్క్వేర్, మాస్ జాతర, సంక్రాంతికి వస్తున్నాం, భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకర వరప్రసాద్ గారు, తాజాగా డెకాయిట్ మూవీలతో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. సంగీత దర్శకుడిగానే కాకుండా, సింగర్‌గా, పాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు భీమ్స్.

Bheems Ceciroleo Inspiring Journey From Struggles to Tollywood Success

హిట్ మెషిన్ అనిల్ రావిపూడికి ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన భీమ్స్.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డెకాయిట్‌తో తన మార్క్ చూపించారు భీమ్స్. ఈ క్రమంలోనే డెకాయిట్ సక్సెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తన సినీ జర్నీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియో ముందు వాటర్ పైప్ లీక్ అవుతూ ఉండేది. ఆ లీకైన వాటర్‌ని తీసుకుని అక్కడే బట్టలు ఊతుక్కుని, అక్కడే పాటలు రాసుకుంటూ, అక్కడే ఆ పిచ్చి మొక్కల మీదే ఆరబెట్టుకుని అక్కడి నుంచి ఈ స్టూడియోలోకి ఎలా రావాలి? ఎలా కలవాలి? అని సుమారుగా ఒక 8 సంవత్సరాలు తిరిగేవాడినని భీమ్స్ గుర్తుచేసుకున్నారు.

అవకాశాల కోసం గేట్ లోపలికి వెళ్తూ తన్నులు తినేవాడిని, ఎదురుచూసేవాడిని, కానీ ఒకరోజు రానే వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోలోకి నన్ను తీసుకెళ్లి.. ఆ స్టూడియోలో నాకంటూ ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టుకుని పనిచేసే అవకాశం ఈ ప్రకృతి కల్పించింది. అలాంటి ప్రకృతి నాకు దీవెనలు ఇచ్చి.. సాక్షాత్తూ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం లాంటి దేవాలయంలోకి నన్ను కూర్చోబెట్టింది. అక్కడ సుప్రియమ్మను కలిసే అవకాశం, మాట్లాడే అవకాశమే కాకుండా కలిసి సినిమా చేసే అవకాశం, మేడంతో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు భగవంతుడికి, ప్రజలకి , నన్ను నడిపించిన పాటకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సుప్రియ గారికి రుణపడి ఉంటాను అన్నారు.

అన్నపూర్ణ స్టూడియోలోకి నేను అడుగుపెట్టినప్పటి నుంచి ధమాకా బ్లాక్‌బస్టర్, బలగం బ్లాక్‌బస్టర్, మ్యాడ్ బ్లాక్‌బస్టర్, మ్యాడ్ 2 బ్లాక్‌బస్టర్, టిల్లూ స్క్వేర్ బ్లాక్‌బస్టర్, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్, శంకర వరప్రసాద్ గారు బ్లాక్‌బస్టర్, ఇప్పుడు డెకాయిట్ బ్లాక్‌బస్టర్ అని భీమ్స్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కష్టపడితే ఎంతటి వారైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, అందుకే ప్రకృతి కూడా సహకరిస్తుందని భీమ్స్ జీవితం నిరూపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X