మంచి టైమ్‌లో అలా కలిసొచ్చింది.. డబుల్ కంగ్రాట్స్: నితిన్‌పై అల్లు అర్జున్ కామెంట్స్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సూపర్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు పెళ్లి సంబరాలు, మరోవైపు భీష్మ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ హుషారుగా ఉన్నాడు. ఈ తరుణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. డబుల్ కంగ్రాట్స్ అంటూ నితిన్ ఉత్సాహాన్ని రెండింతలు చేశాడు.
తాజాగా ట్విట్టర్ వేదికగా సందేశం పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. ''డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్‌లో పూర్తిచేయబడతాయి. మంచి టైమ్ లో నీకు భీష్మ రూపంలో బాగా కలిసొచ్చింది. నీకు అంతా మంచే జరగాలి. 'భీష్మ' టీమ్ మొత్తానికి నా ప్రత్యేక అభినందనలు'' అని పేర్కొన్నాడు.
ఆ వెంటనే మరో ట్వీట్ పోస్ట్ చేసిన బన్నీ.. ''ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మిక సూపర్, ఇక నా నిర్మాత వంశీకి ప్రత్యేక శుభాకాంక్షలు. 2020 జనవరి, ఫిబ్రవరి మీకు చాలా గొప్పది. మరోసారి ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్" అంటూ సందేశమిచ్చారు.

'ఛలో' అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల రెండో ప్రయత్నంలోనూ సక్సెస్ అయ్యాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'భీష్మ' మూవీ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో నితిన్ హీరోగా నటించగా ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ఆడిపాడింది. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయిందని తెలిసింది. ప్రస్తుతం 'భీష్మ' మూవీ విజయవంతంగా రన్ అవుతూ మంచి వసూళ్లు రాబడుతోంది.


Click it and Unblock the Notifications











