వారి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు భీష్మ వస్తున్నాడు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
మొదటి ప్రయత్నంగా చేసిన ఛలో సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు వెంకీ కుడుముల. ఇక రెండో ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేందుకు కాస్త సమయమే తీసుకున్నా.. చకాచకా షూటింగ్‌ను పూర్తి చేసేస్తున్నాడు. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నితిన్‌ను సక్సెస్ బాట పట్టించేందుకు వెంకీ కుడుముల గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది.
భీష్మ అనే సినిమా టైటిల్ పెట్టడం నుంచి ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోన్నట్లు సమాచారం. తన మొదటి సినిమాలో మెరిసిన రష్మిక మందాన్ననే రెండో సినిమాకూ ఎంచుకున్నాడు. వీరిద్దరిపై విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన రాగా.. మళ్లీ అందర్నీ ఆశ్చర్యపరిచేందుకు చిత్రయూనిట్ సిద్దమవుతోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్‌ను వదలనున్నారు. అందుకు 7వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ప్రేమకథా చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం రష్మిక బన్నీ, సుకుమార్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా.. నితిన్ రంగ్ దే అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











