షాకింగ్: భీష్మ విడుదలకు బ్రేక్ పడ్డట్లేనా? బీజేపీ ధార్మిక సెల్ ఆవేదన
యంగ్ హీరో నితిన్ తాజా సినిమా భీష్మ మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 21న) విడుదల కానుంది. పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్న భీష్మ సినిమాకు మాంచి హైప్ తీసుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలపై వివాదాలు తెరపైకి రావడం హాట్ ఇష్యూగా మారింది.
మహాభారతంలో భీష్ముడి పేరుని ఈ సినిమాకు టైటిల్‌గా వాడటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదనను వ్యక్తం చేసింది. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడి పేరుని లవర్‌బోయ్ పాత్రకు పెట్టడం సబబు కాదని పేర్కొంటూ నిరసన తెలిపారు బీజేపీ ధార్మిక సెల్ సభ్యులు. వెంటనే ఆ టైటిల్ మార్చాలని, లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీ కృష్ణచైతన్య, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము తదిరతులు డిమాండ్ చేశారు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ యూత్ ఆడియన్స్‌ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. చూడాలి మరి ఈ సినిమాకు టైటిల్ మారుస్తారా? లేక అలాగే రిలీజ్ చేస్తారా? అనేది.


Click it and Unblock the Notifications











