వైజాగ్ పయనమైన భీష్మ టీమ్.. ఈ టైమ్‌లో ఎందుకో తెలుసా?
ప్రస్తుతం భీష్మ మూవీ టీమ్ మంచి జోష్‌లో ఉంది. తమ సినిమాకు ఆశించిన ఫలితం రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు యూనిట్ సభ్యులంతా. ఈ మేరకు అందరూ కలిసి వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అయితే ఈ ట్రిప్ ఏదో సరదాగాకు అనుకుంటే పొరపాటే!. వైజాగ్ వేదికగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పేందుకే వాళ్లంతా వైజాగ్ పయనమవుతున్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన భీష్మ టీమ్.. ఇక వైజాగ్‌లో గ్రాండ్ థాంక్స్ మీట్ నిర్వహించబోతోంది. ఈ మేరకు ఫిబ్రవరి 29 వ తేదీని కన్ఫర్మ్ చేసి అఫీషియల్‌గా ప్రకటించారు యూనిట్ సభ్యులు. ఈ గ్రాండ్ థాంక్స్ మీట్ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది.

భీష్మ చిత్రానికి విడుదలకు ముందు నుంచే మంచి ప్రమోషన్స్ చేయడంతో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా తొలిరోజే ఆ అంచనాలను అందుకొని సక్సెస్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన రోజు మొదలుకొని ఇప్పటిదాకా భారీ వసూళ్లు రాబడుతూ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది భీష్మ మూవీ.
వెంకీ కుడుములు డైరెక్ట్ చేసిన 'భీష్మ' మూవీలో నితిన్ హీరోగా నటించగా ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న ఆడిపాడింది. అనుకున్నట్లుగానే క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది ఈ సినిమా. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది. కామెడీయే సినిమాకు ప్రధాన బలంగా నిలిచి వసూళ్ల ప్రవాహం పారిస్తోంది.


Click it and Unblock the Notifications











